తెలంగాణ

telangana

ETV Bharat / business

'ఫ్లిప్​కార్ట్​ ధనా​ధన్​ మొబైల్​ ఆఫర్స్' నేటి నుంచే... - Flipkart careers

మొబైల్​ ఫోన్లపై భారీ డిస్కౌంట్​ ఆఫర్లతో ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్​కార్ట్​ సేల్​ను తీసుకువచ్చింది. నేటి నుంచి 'మొబైల్స్‌ బొనాంజా' పేరిట ఈ సేల్​ నిర్వహించనుంది. ఐఫోన్​ మొదలుకొని అన్ని రకాల మొబైల్​ ఫోన్​లపై భారీ ఆఫర్లను ప్రకటించింది. మరి ఆ ఆఫర్లేంటో.. మీరూ చూసేయండి.

Flipkart huge discoutns
ఫ్లిప్​కార్ట్​ ధనా​ధన్​ మొబైల్​ ఆఫర్స్

By

Published : Feb 17, 2020, 5:58 AM IST

Updated : Mar 1, 2020, 2:11 PM IST

ప్రముఖ ఈ-కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ మరో సేల్‌కు సిద్ధమైంది. నేటి నుంచి ఈ నెల 21 వరకు 'మొబైల్స్‌ బొనాంజా' పేరిట సేల్‌ను ప్రకటించింది. ఇందులో మొబైల్స్‌పై భారీ డిస్కౌంట్స్​ అందిస్తోంది. యాక్సిస్‌ బ్యాంక్‌ క్రెడిట్‌/డెబిట్‌ కార్డులపై 10 శాతం డిస్కౌంట్‌ లభించనుంది. మరికొన్ని మొబైల్స్‌ కొనుగోలుపై ఎక్స్ఛేంజ్‌ ఆఫర్లూ అందనున్నాయి. ఐదురోజుల పాటు సాగే ఈ సేల్‌లో లభించబోయే డిస్కౌంట్లపై ఓ లుక్కేద్దాం..

శాంసంగ్​పై భారీ తగ్గింపు...

ముఖ్యంగా ఈ సేల్‌లో శాంసంగ్‌ మొబైల్స్‌పై మంచి డిస్కౌంట్లు లభిస్తున్నాయి. గతేడాది విడుదలైన శాంసంగ్‌ ఏ50 ఫోన్‌ ధర రూ.14,999 కాగా.. సేల్‌ సమయంలో రూ.12,999కే అందించనున్నారు. శాంసంగ్‌ ఎస్‌9 మొబైల్‌ ధర రూ.26,999 ఉండగా.. దీన్ని 22,999కే అందించనున్నారు. ఎస్‌9+ మొబైల్‌ ధర రూ.29,999 కాగా.. 27,999కే సేల్‌లో లభిస్తుంది.

మరిన్ని ఆఫర్ల వివరాలివి...

వీటితో పాటు ఐఫోన్‌ ఎక్స్‌ఎస్‌ 64జీబీ వేరియంట్‌ ధర రూ.59,999 కాగా.. సేల్‌ సమయంలో దీన్ని రూ.5 వేలు తక్కువకే విక్రయించనున్నారు. ఆనర్‌ 9ఎక్స్‌ 4జీబీ /128జీబీ వేరియంట్‌ ధర రూ.13,999 కాగా.. రూ.12,999కే అందించనున్నారు. ఒప్పో కే1 రూ.9,990 (ప్రస్తుతం రూ.13,990)కే అందిస్తుండగా.. రియల్‌మీ 5, రియల్‌మీ 3పై రూ.500 వరకు డిస్కౌంట్‌ లభించనుంది. వీటితో పాటు శాంసంగ్‌ ఎస్‌10 లైట్‌, ఎంఐ ఏ3, రియల్‌మీ ఎక్స్‌టీ ప్రో, ఒప్పో రీనో, వివో జడ్‌ 1ప్రో వంటి మొబైల్స్‌పై ఫ్లిప్‌కార్ట్‌ ఆఫర్లు అందిస్తోంది.

ఇదీ చదవండి:టెల్కోలపై చర్యలకు సిద్ధమైన టెలికాం శాఖ

Last Updated : Mar 1, 2020, 2:11 PM IST

ABOUT THE AUTHOR

...view details