ఆన్‌లైన్ మార్కెటింగ్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ 2021 నాటికి ప్లాస్టిక్ రహిత డెలివరీలు చేసే దిశగా అడుగువేసింది. దేశవ్యాప్తంగా 70కు పైగా ఫుల్‌ఫిల్‌మెంట్ కేంద్రాల్లో ప్లాస్టిక్ రహిత డెలివరీలు చేస్తోంది. ప్లాస్టిక్, పాలిథిన్‌లను పర్యావరణ హిత పేపర్, రీసైక్లింగ్ పేపర్ బ్యాగ్‌లతో భర్తీ చేస్తోంది. ఇక బబుల్ పేపర్ స్థానంలో కత్తిరించిన కాగితం ముక్కలు, 2ప్లే రోల్ వంటి వాటితో భర్తీ చేసింది.
'ఫ్లిప్ కార్ట్‌లో సుస్థిర, బాధ్యతాయుతమైన వ్యాపార విధానాలను అనుసరిస్తున్నాం. 100శాతం సింగల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేస్తాం. పర్యావరణ హిత విధానాల అమలు దిశగా మేము వేసిన కీలక అడుగు ఇది. కొవిడ్ వ్యాప్తి వంటి క్లిష్ట సమయంలో మేము దీనిని సాధించాం. అటువంటి సమయంలో కూడా ప్రాధాన్యం ఇవ్వాల్సిన అంశాలను వదలకుండా అనుసరించిన మా బృందాలను అభినందిస్తున్నాము. ఇక మా విక్రేతలు కూడా ఈ విధానాన్ని అందిపుచ్చుకొనేట్లు ప్రోత్సహిస్తాం.