బిగ్ సేవింగ్ డేస్ సేల్ ముగిసిన వెంటనే మరో ఆఫర్‌తో ముందుకొచ్చింది ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్. 'ఫ్లాగ్ షిప్ ఫెస్ట్' పేరుతో ఈ కొత్త ఆఫర్‌ను తీసుకొచ్చింది. హై ఎండ్ స్మార్ట్ ఫోన్లకు సంబంధించిన ఈ ఆఫర్ సోమవారం (మే 10) ప్రారంభమైంది. ఈ నెల 14 వరకు అందుబాటులో ఉండనుంది.
ఆఫర్లు ఇలా..
ఐఫోన్ 11, ఐఫోన్ 12, శాంసంగ్ ఎఫ్62 సహా ఫ్లాగ్షిప్ సెగ్మెంట్లో భారీ డిమాండ్ ఉన్న దాదాపు అన్ని మోడళ్లపై డిస్కౌంట్ ఆఫర్‌ను ప్రకటించింది ఫ్లిప్‌కార్ట్. రూ.2,500 నెలవారీ ఈఎంఐతో ఫ్లాగ్ షిప్ ఫోన్లను సొంతం చేసుకునే ఆఫర్ కూడా ఈ సేల్‌లో ఉంది.
తగ్గింపు ఇలా..
- ఐ ఫోన్ 11.. 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ప్రస్తుత ధర రూ.54,900గా ఉండగా.. ఫ్లాగ్షిప్ సేల్‌లో దీని ధరను రూ.48,999కి తగ్గించింది ఫ్లిప్‌కార్ట్. 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.55,999గా నిర్ణయించింది.
- ఐఫోన్ 12, 12 ప్రో లాంటి మోడళ్లపైనా ప్రత్యేక డిస్కౌంట్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఐఫోన్ ఎక్స్ ఆర్ ధరను రూ.36,999గా నిర్ణయించింది.
- రియల్మీ ఎక్స్ 50 ప్రో 5జీ మొబైల్ ధరను రూ.41,999 నుంచి ఏకంగా రూ.24,999కి తగ్గించింది ఫ్లిప్‌కార్ట్.
- ఎల్జీ వింగ్ 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.29,999గా నిర్ణయించింది.
- వీటన్నింటితో పాటు సిటీ బ్యాంక్ డెబిట్, క్రెడిట్ కార్డ్ ద్వారా చెల్లింపులు చేస్తే.. 10 శాతం అదనపు డిస్కౌంట్ పొందొచ్చు. రూ.20 వేలకు మించి కొనుగోళ్లు జరిపిన వారికి అదనంగా మరో రూ.500 క్యాష్ బ్యాంక్ లభించనుంది.
ఇదీ చదవండి:ఆగని పెట్రో బాదుడు- మళ్లీ పెరిగిన ఇంధన ధరలు