తెలంగాణ

telangana

ETV Bharat / business

ఒడిలో ల్యాపీకి.. అనువైన గ్యాడ్జెట్‌లు

కరోనా కారణంగా ఇంకా చాలా మంది వర్క్​ఫ్రమ్​ చేస్తూనే ఉంటారు. అందుకు ల్యాప్ ట్యాప్​ను ఎక్కువ సమయం వాడుతుంటారు. ల్యాప్​ ట్యాప్​ వేడెక్కడం, టైపింగ్​కు కీబోర్డ్​ సరిగా ఉండకపోవడం జరుగుతూ ఉంటుంది. ల్యాప్​ట్యాప్​ను మరింత అనువుగా మలుచుకోవడానికి ఈ సమాచారాన్ని చదివేయండి. ఇందులో చెప్పిన గ్యాడ్జెట్​ను వాడేయండి. ఎటువంటి ఇబ్బంది లేకుండా పని చేసుకోండి. ఆన్​లైన్​ చదువులకూ ఇవి అనుకూలంగానే ఉంటాయి.

Flexible gadgets for lap
ఒడిలో ల్యాపీకి.. అనువైన గ్యాడ్జెట్‌లు

By

Published : Feb 14, 2021, 5:18 AM IST

ఎప్పటి నుంచో నాలుగు గోడల మధ్యే పని, చదువు.. అన్నీనూ! ఇప్పుడిప్పుడే సాధారణ లైఫ్‌స్టైల్‌కి దగ్గరవుతున్నా.. ఏదో తెలియని ఆందోళన. ఈ క్రమంలో ఎక్కువ సమయం ఒడిలో పెట్టుకుని వాడుతున్న ల్యాపీని మరింత అనువుగా మార్చేయాలంటే? ఇవిగోండి.. వీటిని ప్రయత్నించండి. అప్పుడు వర్క్‌ స్టేషన్‌ అదుర్సే! ఆన్‌లైన్‌ చదువులకూ అనుకూలమే!

ల్యాపీకే కాదు.. ఫోన్‌కి కూడా..

ల్యాపీకే కాదు.. ఫోన్‌కి కూడా..

గంటలు గంటలు.. ల్యాప్‌టాప్‌ని ఇక్కడా.. అక్కడా.. పెట్టుకుని పని చేయడం దేనికి? స్మార్ట్‌ టేబుల్‌ ఒకటి ఉండాలిగా! అందుకే ఇది. దీన్ని ఎక్కడైనా అనువుగా పెట్టుకుని వాడొచ్చు. టైప్‌ చేస్తున్నప్పుడు ఒకలా.. వీడియో కాల్‌ మాట్లాడుతున్నప్పుడు మరోలా.. ఇలా అవసరానికి తగినట్టుగా ఈ బుజ్జి టేబుల్‌ స్టాండ్‌ని మార్చుకోవచ్చు. ఫోన్‌ను పెట్టుకునేందుకు ప్రత్యేక స్టాండ్‌ ఉంది. కావాలంటే దీన్ని బుక్‌ స్టాండుగానూ వాడుకోవచ్చు. మడత పెట్టేసి మీ ల్యాపీ బ్యాగులోనే పెట్టుకుని ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు. ధర పెద్ద ఎక్కువేం కాదు. ధర రూ.999లే!

కొనేందుకు: http://amzn.to/3jHlz6Y

చల్లబరిచేందుకు..

చల్లబరిచేందుకు..

ఎక్కువ సమయం పాటు ల్యాపీని వాడే క్రమంలో బాడీ వేడెక్కడం గమనిస్తుంటాం. బిల్ట్‌ఇన్‌గా ఉన్న ఫ్యాన్‌లు చల్లబరిచినప్పటికీ వాడకంలోనూ యూజర్లు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ల్యాపీకి కింది భాగానికి వెంటిలేషన్‌ ఉండేలా చూసుకుంటే మంచిది. అదెలా సాధ్యమంటే.. ఇదిగోండి ఈ 'ఎర్గో వ్యూ' స్టాండ్‌ వాడొచ్చు. ఏడు రకాలుగా దీన్ని అమర్చుకుని వాడుకోవచ్చు. స్టాండ్‌పై ల్యాపీని ఉంచినప్పుడు సాధారణ పద్ధతిలో (నేచురల్‌ ఎయిర్‌ వెంటిలేషన్‌) గాలి వెళ్తూ వేడెక్కడకుండా చూస్తుంది. 12, 13, 14, 15 అంగుళాల ల్యాపీలను స్టాండ్‌పై అమర్చుకునేందుకు వీలుంది. అంతేకాదు.. స్టాండ్‌పై అమర్చుకోడం ద్వారా నిటారుగా కూర్చుని పని చేసుకోవచ్చు. ధర రూ.799

కొనేందుకు: https://amzn.to/2Z7OXcX

అనువైన కీబోర్డు..

అనువైన కీబోర్డు..

నిత్యం ల్యాపీపై పని ఉన్నప్పుడు టైపింగ్‌ని బిల్ట్‌ఇన్‌ కీబోర్డుపై చేయడం కొంచెం కష్టమే. అలాంటప్పుడే వైర్‌లెస్‌ బ్లూటూత్‌ కీబోర్డు అవసరం ఏర్పడుతుంది. మీరూ అలాంటి కీబోర్డు కోసం చూస్తున్నట్లయితే లాగీటెక్‌ అందించే 'కే480 వైర్‌లెస్‌' కీబోర్డుని ప్రయత్నించొచ్చు. అన్ని ఓఎస్‌లనూ సపోర్టు చేస్తుంది. అంతేకాదు.. తక్కువ స్పేస్‌లో పెట్టుకుని టైప్‌ చేసుకోవచ్చు. ల్యాప్‌టాప్‌లనే కాకుండా.. ఫోన్, ట్యాబ్లెట్‌లను ఈ కీబోర్డు సపోర్టు చేస్తుంది. ఒకేసారి మూడు డివైజ్‌లకు కనెక్ట్‌ చేసి వాడుకోవచ్చు. కీబోర్డు పైభాగంలో ఏర్పాటు చేసిన 'ఈజీ-స్వీచ్‌ డయల్‌'ని తిప్పడం ద్వారా కావాల్సిన పరికరానికి కనెక్ట్‌ అవ్వొచ్చు. ఫోన్, ట్యాబ్‌లను డాక్‌ చేసుకునేందుకు వీలుగా కీబోర్డుని తీర్చిదిద్దారు. ధర రూ.2,990

కొనేందుకు: https://amzn.to/3a9IJ2F

అన్నింటికీ తగిన ఇంటర్ఫేస్‌..

అన్నింటికీ తగిన ఇంటర్ఫేస్‌..

ఇంట్లో నుంచి పని చేస్తున్నా.. ఆఫీస్‌లో అయినా.. అవసరం మేరకు ల్యాపీకి ఫోన్, ట్యాబ్, ఇతర యూఎస్‌బీ డ్రైవ్‌లు, కార్డు రీడర్లను అనుసంధానం చేయాల్సిరావచ్చు. ఒక దాంట్లో డేటాని మరో దాంట్లోకి ట్రాన్స్‌ఫర్‌ చేయడం అనివార్యం కావచ్చు. అందుకు 'యూఎస్‌బీ టైప్‌-సీ హబ్‌'ని వాడాల్సి రావొచ్చు. అలాంటప్పుడు వీటిని (బెల్కిన్‌ యూఎస్‌బీ-సీ మల్టీమీడియా హబ్, పోర్ట్రానిక్స్‌ పీఓఆర్‌ ఎంపోర్ట్‌) ప్రయత్నించండి. పలు యూఎస్‌బీ డ్రైవ్‌లు, కార్డు రీడర్లు, హెచ్‌డీఎంఐ పోర్టులను ఇవి సపోర్టు చేస్తాయి.

కొనేందుకు: https://amzn.to/3rG6WDE

కొనేందుకు: https://amzn.to/2Oru7TP

ఇదీ చూడండి:ఇవి తెలుసుకున్నాకే.. స్మార్ట్ ఫోన్ కొనండి

ABOUT THE AUTHOR

...view details