తెలంగాణ

telangana

ETV Bharat / business

15 రోజుల్లో 5 ఐపీఓలు.. రూ. 27 వేల కోట్ల సమీకరణే లక్ష్యం - పాలసీ బజార్ ఐపీఓ

వచ్చేనెల తొలి అర్ధ భాగంలో పేటీఎం సహా ఐదు కంపెనీలు పబ్లిక్ ఇష్యూకు(ఐపీఓ) రానున్నాయి. పేటీఎం రూ.18 వేల కోట్లకుపైగా సమీకరించి.. దేశంలో అతిపెద్ద ఐపీఓ అవతరించే అవకాశం ఉంది. దీనితో పాటు మరో నాలుగు సంస్థలు పబ్లిక్ ఇష్యూ వైపు అడుగులు వేస్తున్నాయి. ఈ ఐదు ఐపీఓల ద్వారా రూ. 27 వేల కోట్లు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి.

IPOs to hit mkt in first half of Nov
ఐపీఓకు వస్తున్న కంపెనీలు

By

Published : Oct 31, 2021, 5:25 PM IST

గతకొంత కాలంగా మార్కెట్లలో పబ్లిక్​ ఇష్యూల (ఐపీఓ) జోరు కొనసాగుతోంది. ఈ క్రమంలోనే నవంబరు తొలి అర్ధభాగంలో కొత్తగా ఐదు కంపెనీలు పబ్లిక్‌ ఇష్యూకు రానున్నాయి. మరో రెండు సంస్థల ఐపీఓ సబ్​స్క్రిప్షన్​ ముగియనుంది.

పేటీఎం

డిజిటల్ ఆర్థిక సేవల సంస్థ పేటీఎం(Paytm IPO) మాతృ సంస్థ వన్​97 కమ్యూనికేషన్స్​ నవంబరు 8న ఐపీఓకు రానుంది. 10వ తేదీతో ముగియనుంది. ఐపీఓ ద్వారా రూ.18,300 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఒక్కో షేరు ధర రూ.2,080-రూ.2,150గా ఉంటుందని అధికారిక వర్గాలు తెలిపాయి. దీంతో దేశంలో అతిపెద్ద ఐపీఓ ఇదే కానుంది.

పాలసీ బజార్​

ఆన్‌లైన్​ ఇన్సూరెన్స్​ అగ్రిగేటర్​​ పాలసీ బజార్​(policy bazaar ipo)​ మాతృ సంస్థ పీబీ ఫిన్​టెక్​ వచ్చే నెల 1న ఐపీఓ సబ్​స్క్రిప్షన్​కు రానుండగా.. 3వ తేదీతో ముగియనుంది. పబ్లిక్​ ఇష్యూల ద్వారా రూ.5,710 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఒక్కో షేరుకు ధర రూ.940-రూ.980గా నిర్ణయించింది. తాజా షేర్ల ద్వారా రూ. 3,750 కోట్లు .. ఆఫర్​ ఫర్​ సేల్​ ద్వారా రూ.1,960 కోట్లు సమీకరించనుంది.

మూడు ఐపీఓలు

కేఎఫ్​సీ, పిజ్జా హట్స్​ అవుట్​లెట్స్​ను నిర్వహించే సఫైర్​ ఫుడ్స్​ ఇండియా ఐపీఓను నవంబరు 9న సబ్‌స్క్రిప్షన్​కు​ తీసుకొచ్చేందుకు సిద్ధమవుతుంది. దీంతో పాటు బ్యూటీ ఉత్పత్తుల సరఫరాదారు ఎస్​జేఎస్​ ఎంటర్​ప్రైజెస్, మైక్రోక్రిస్టలైన్​ సెల్యులోజ్​ తయారీదారు సిగాచి ఇండస్ట్రీస్​ పబ్లిక్ ఇష్యూకు సిద్ధమవుతున్నాయి.

ఈ ఐదు ఐపీఓలు.. మొత్తం రూ. 27 వేల కోట్లు సమీకరించే అవకాశం ఉంది.

ఇవి ముగుస్తాయ్​..

నైకా

ఎఫ్‌ఎస్‌ఎన్‌ ఈ-కామర్స్‌ వెంచర్స్‌ లిమిటెడ్‌ నేతృత్వంలోని బ్యూటీ ఉత్పత్తుల అంకుర సంస్థ నైకా ఐపీఓ(Nykaa ipo date) సబ్‌స్క్రిప్షన్‌ అక్టోబరు 28న(Nykaa ipo date) ప్రారంభమైంది. నవంబరు 1న ముగుస్తుంది. మొత్తం రూ.5,352 కోట్లు సమీకరించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఒక్కో షేరు ధర రూ.1,085-1,125 గా(Nykaa ipo price) నిర్ణయించింది. తాజా షేర్ల ద్వారా రూ.630 కోట్లు కాగా.. మరో 4,19,72,660 షేర్లు ఆఫర్ ఫర్ సేల్ కింద విక్రయించనుంది.

ఫినో పేమెంట్స్ బ్యాంకు

ఫినో పేమెంట్స్ బ్యాంకు ఐపీఓ సబ్‌స్క్రిప్షన్​ అక్టోబరు 29న ప్రారంభమవగా.. నవంబరు 2 తేదీతో ముగుస్తుంది. పబ్లిక్​ ఇష్యూల ద్వారా రూ.1,200 కోట్లు సమీకరించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఒక్కో షేరు ధర రూ.560-577 గా(Fino Payments Bank IPO) నిర్ణయించింది. తాజా షేర్ల ద్వారా రూ.300 కోట్లు కాగా.. మరో 1.56 షేర్లు ఆఫర్ ఫర్ సేల్ కింద విక్రయించనుంది.

మంచి లాభాలు పొందేందుకు, మూలధనం సమకూర్చుకునేందుకు ఏ కంపెనీకి అయినా బుల్​ మార్కెట్‌లు ఉత్తమ సమయాలు" అని లెర్న్​యాప్.కామ్​ వ్యవస్థాపకుడు, సీఈఓ ప్రతీక్​ సింగ్​ పేర్కొన్నారు. "ప్రధానంగా టెక్ కంపెనీలు త్వరగా వృద్ధి చెందే సామర్థ్యం వల్ల మెరుగైన లాభాలు పొందుతాయి. అందుకే పలు అంకుర టెక్ సంస్థలు ఈసారి ఐపీఓకు వెళ్లడం ద్వారా నగదు సమీకరిస్తున్నాయి" అని ఆయన పేర్కొన్నారు. మార్కెట్ పతనమైనంత వరకు టెక్​ కంపెనీలు ఐపీఓకు వెళ్లడం కొనసాగుతుంది. కాబట్టి భవిష్యత్తులో మార్కెట్లు పతనమైతే, ఐపీఓలు కూడా తగ్గుతాయని ఆయన చెప్పారు.

2021లో ఇప్పటి వరకు దాదాపు 41 కంపెనీలు ఐపీఓ పూర్తిచేసుకున్నాయి. రూ.66,915 కోట్లు సమీకరించాయి.

ఇదీ చూడండి:పెన్షనర్లకు అలర్ట్.. ఇలా చేయకపోతే డబ్బులు రావు!

ABOUT THE AUTHOR

...view details