Fitch India GDP: ఈ ఆర్థిక సంవత్సరానికి గానూ... జీడీపీ వృద్ధిరేటు అంచనాను మరోసారి తగ్గించింది ఫిచ్ రేటింగ్స్. మార్చితో ముగియనున్న ఆర్థిక సంవత్సర వృద్ధి రేటు 8.4 శాతానికి పరిమితమవ్వచ్చని అంచనా వేసింది. అయితే వచ్చే ఏడాదికి భారత్ వృద్ధిరేటు 10.3శాతంగా ఉండొచ్చని పేర్కొంది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021-22)లో వృద్ధిరేటు 8.4 శాతంగా నమోదు కావొచ్చని అంచనా వేసిన సంస్థ.. గత అక్టోబర్లో మాత్రం 8.7 శాతం ఉంటుందని పేర్కొంది. అయితే ఇప్పుడు 0.3 శాతం మేర తగ్గించింది. కానీ వచ్చే ఏడాది మాత్రం 10 శాతానికి పైగా నమోదు అవుతుందని తాజాగా పేర్కొంది.