న్యుమోనియాను కట్టడి చేసేందుకు సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అభివృద్ధి చేసిన టీకాను.. కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ ప్రారంభించనున్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. అనంతరం వచ్చే వారంలోనే టీకాలు మార్కెట్లోకి అందుబాటులోకి రానున్నట్లు వెల్లడించాయి. విదేశీ కంపెనీలు తయారు చేసిన న్యూమోనియా వ్యాక్సిన్‌ల కంటే సీరం అభివృద్ధి చేసిన టీకా ఉత్తమ ఫలితాలను అందిస్తున్నట్లు పరిశోధకులు తెలిపారు.
దేశీయంగా న్యుమోనియా టీకా- త్వరలో అందుబాటులోకి - టీకాలు
సీరం సంస్థ దేశీయంగా అభివృద్ధి చేసిన న్యుమోనియా టీకా వచ్చే వారంలోనే అందుబాటులోకి వచ్చే అవకాశముంది. కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ దీనిని ప్రారంభించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. న్యుమోనియాకు సంబంధించి దేశీయంగా విడుదలైన తొలి టీకా ఇదే కావడం విశేషం.
టీకాకు సంబంధించిన 1, 2, 3 దశల క్లినికల్ ట్రయల్స్ డేటాను పరిశీలించిన భారత ఔషధ నియంత్రణ సంస్థ(డీసీజీఐ).. సీరం అభివృద్ధి చేసిన న్యూమోకాకల్ పాలిశాకరైడ్ కాంజుగేట్ వ్యాక్సిన్‌కు జులైలోనే మార్కెట్ అనుమతులు జారీ చేసింది. న్యూమోనియాకు సంబంధించిన దేశీయంగా విడుదలైన తొలి టీకా ఇదే కావడం విశేషం. కాగా వ్యాక్సిన్‌కు సంబంధించిన మూడు దశల క్లినికల్ ట్రయల్స్‌ను సీరం సంస్థ భారత్‌తో పాటు ఆఫ్రికాలోని గాంబియాలో నిర్వహించింది.
ఇదీ చూడండి: 'భయపెడుతోన్న మరో మహమ్మారి.. కరోనా కంటే ప్రమాదకారి'