2021-22 ఏడాదికిగానూ వార్షిక బడ్జెట్ సన్నాహాకాలను అక్టోబర్16 నుంచి ప్రారంభించనున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. ఈ మేరకు గురువారం నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఇది మోదీ 2.0 ప్రభుత్వం, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆధ్వర్యంలో రానున్న మూడో పద్దు. కరోనా మహమ్మారితో కుదేలైన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడమే లక్ష్యంగా బడ్జెట్ రూపొందించాల్సి ఉందని అభిప్రాయపడింది ఆర్థిక శాఖ. ఇంకా ఆదాయ మార్గాలకు సంబంధించిన క్లిష్ణమైన సమస్యలకు బడ్జెట్లో పరిష్కారం చూపాల్సి ఉందని కేంద్రం పేర్కొంది.
''ఆర్థిక వ్యవహారాల శాఖ బడ్జెట్ విభాగానికి చెందిన బడ్జెట్ సర్క్యులర్ ప్రకారం 2020 అక్టోబర్ 16 నుంచి ముందస్తు సమావేశాలు ప్రారంభమవుతాయి. నవంబర్ మొదటి వారం వరకు ఇవి కొనసాగుతాయి.''
-ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్