Financial plan for children: పెట్టుబడులు ఎప్పుడూ ఆర్జించే వ్యక్తుల పేరుమీదే ఉండాలి. కానీ, కొంతమంది తమ పిల్లలకు పలు సందర్భాల్లో వచ్చిన నగదు బహుమతులను ఏదో ఒక రూపంలో మదుపు చేయాలని ప్రయత్నిస్తుంటారు. భారతీయ చట్టాల ప్రకారం 18 ఏళ్ల లోపు ఉన్నవారిని మైనర్లుగా పేర్కొంటారని తెలిసిందే. పిల్లల పేరిట బ్యాంకు ఖాతాలు, డీమ్యాట్ తదితర ఖాతాలు ప్రారంభించి, సులభంగా మదుపు చేయడం సాధ్యం కాదు. దీనికి కొన్ని నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. మైనర్ల హక్కులు కాపాడేందుకు వారి పేరుమీద చేసే పెట్టుబడులకు కొన్ని నిబంధనలు ఏర్పాటు చేశారు.
- పిల్లలు పెట్టుబడి నిర్ణయాలను సొంతంగా తీసుకోలేరు. వారికి అంత అవగాహనా ఉండదు. కాబట్టి, ఒక సంరక్షకుడు వారి పెట్టుబడులను పర్యవేక్షించాల్సి ఉంటుంది. సహజంగా తల్లిదండ్రులు ఈ బాధ్యత నిర్వహిస్తారు. కొన్నిసార్లు న్యాయస్థానాలు ప్రత్యేకంగా పిల్లల కోసం సంరక్షకుడిని నియమించే అవకాశం ఉంది.
- పెట్టుబడులు పెట్టేందుకు పిల్లల పుట్టిన తేదీ ధ్రువీకరణ తప్పనిసరిగా అవసరం. దీంతోపాటు, సంరక్షకుడికి, పిల్లలకు ఉన్న బంధుత్వాన్ని నిరూపించే పత్రాలూ కావాలి.
- సంరక్షకుడిగా ఉన్న వ్యక్తి బ్యాంకు ఖాతా వివరాలు, పాన్ అవసరం అవుతాయి. మీ ఖాతాదారు గురించి తెలుసుకోండి (కేవైసీ) నిబంధనలు పూర్తి చేయాల్సి ఉంటుంది.
- పెట్టుబడులకు సంబంధించిన చెల్లింపులన్నీ సంరక్షుడిగా ఉన్న వ్యక్తి బ్యాంకు ఖాతా నుంచే వెళ్తాయి.
- ఆయా పెట్టుబడి పథకాలకు సంబంధించిన యజమాని మాత్రం మైనరే అవుతారు.
- మైనర్ పేరిట ఖాతాను ఉమ్మడిగా ప్రారంభించడం కుదరదు. ఈ ఖాతాలకు నామినీ పేరూ పేర్కొనలేరు.
మేజర్‌గా మారితే...
- పిల్లలకు 18 ఏళ్లు నిండిన తర్వాత పాన్‌తోపాటు, మీ ఖాతాదారు గురించి తెలుసుకోండి (కేవైసీ) పత్రాలను సమర్పించాలి.
- పిల్లల సంతకాన్ని బ్యాంకు ద్వారా అటెస్ట్ చేయించాలి. దాన్ని ఖాతాలున్న బ్యాంకులు, డీమ్యాట్ సంస్థల్లో అందించాలి. సంరక్షకుడి సంతకం స్థానంలో దీన్ని వాడతారు.
- అప్పటి వరకూ మైనర్ పేరిట ఉన్న ఖాతాలు.. ఇక నుంచి కొత్త ఖాతాలుగా మారతాయి. మేజర్ అయిన పిల్లలు తమ ఖాతాలు సొంతంగా నిర్వహించుకునేందుకు వీలుంటుంది.
పెట్టుబడుల విషయంలో..