తెలంగాణ

telangana

ETV Bharat / business

పతంగుల పండుగ నేర్పే పెట్టుబడుల పాఠం - buisness news today

సంక్రాంతి నాడు పతంగులు ఆకాశంలోకి పంపించేందుకు కావాల్సిన ఏర్పాట్లను ముందే చేసుకోవాల్సి ఉంటుంది. అలానే పెట్టుబడులు పెట్టే ముందు కూడా సన్నద్ధత అవసరం. పతంగుల పండుగకు, పెట్టుబడులకు ఉన్న పోలికలేంటో ఓ సారి పరిశీలిద్దాం.

financial_lessons_from_kite_festival
పతంగి పండుగ నేర్పే పెట్టుబడుల పాఠం

By

Published : Jan 14, 2021, 9:34 AM IST

Updated : Jan 14, 2021, 12:06 PM IST

భారత్ ఓ పండుగల దేశం. ప్రతి పండుగ వెనుక ఓ కారణం ఉంటుంది. సంక్రాంతి కూడా అలాంటి పండుగనే. కొత్త పంట సీజన్ దీనితో ప్రారంభమవుతుంది. వివిధ రకాల పేర్లతో ఈ పండుగను దేశవ్యాప్తంగా చేసుకుంటారు. పతంగుల పండుగ అని దీనికి మరో పేరు ఉంది.

ఆర్థికంగా కూడా పండుగలకు చాలా ప్రాధాన్యత ఉంది. సంక్రాంతి పండుగ నుంచి ఆర్థిక విషయాలు ఎలాంటివి నేర్చుకోవచ్చో ఓసారి చూద్దాం.

సన్నద్ధత ముఖ్యం

సంక్రాంతి నాడు పతంగుల ఆకాశంలోకి పంపించేందుకు కావాల్సిన ఏర్పాట్లను ముందే చేసుకోవాల్సి ఉంటుంది. దారం లేదా మాంజా తదితరాలను ముందే సమకూర్చుకుంటారు. అలానే పెట్టుబడులు పెట్టే ముందు సన్నద్దత కావాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన విషయాలపై పూర్తి పట్టు సాధించాల్సి ఉంటుంది. అంతేకాకుండా నైపుణ్యాలను పెంచుకోవాల్సి ఉంటుంది.

లక్ష్యం ఆధారంగా నడుచుకోవటం

పతంగి ఎత్తులో ఎగురుతున్నప్పుడు.. కింద దానికి ఉండే దారం తెగకుండా చూసుకోవాలి అప్పుడే అది ఇంకా ఎత్తుకు ఎగరగలదు. పెట్టుబడి పెట్టగానే దానిని ట్రాక్ చేస్తూ ఉండాలి. దీని వల్ల సంపద సృష్టించుకొని భవిష్యత్తులో సంతోషంగా ఉండవచ్చు.

ఓపిక చాలా ముఖ్యం…

పతంగులు ఎగరవేసే రోజు గాలి సరిగా లేనప్పటికీ.. గాలిపటం ఎగిరేంత వరకు ప్రయత్నిస్తాం. అంటే విజయం వచ్చేవరకు ప్రయత్నం చేస్తునే ఉంటాం అన్నమాట. పెట్టుబడుల్లో కూడా అనుకున్న ఫలితం రాని పక్షంలో పెట్టుబడి ఉపసంహరణ చేసే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో పెట్టుబడిదారుల ఓపికకు పరీక్ష ఎదురవుతుంది. పెట్టుబడి ఫలితాలు పొందాలంటే వేచి చూడాల్సి ఉంటుంది.

రక్షణ..

పతంగులను ఎగురవేసే సమయంలో కళ్లకు సమస్య ఉండకుండా కళ్లజోడు, ఇతర రకాల హాని కలగకుండా రక్షణ ఏర్పాట్లు చేసుకుంటాం. ఇదే తీరులో మన పెట్టుబడుల్లో అవాంఛిత సమయాల్లో కాపాడేందుకు వీలుగా బీమా ఉండాలి. అంతేకాకుండా ఆర్థికంగా ఇబ్బందులు తలెత్తకుండా రిస్కు తక్కువున్న పెట్టుబడులు ఉండాలి.

దీర్ఘకాలిక దృష్టి..

పతంగి ఎగరవేసేందుకు రోజు మొత్తం ప్రయత్నాలు చేస్తాం. ఒక పతంగి పడిపోయిందని ఆగిపోకుండా మళ్లీ ప్రయత్నిస్తాం. ఇలా చేయటం వల్లనే మిగతా వారందరినీ దాటి ముందుకు వెళ్తారు. అన్ని పతంగులు ఆకాశాన్ని చేరుకోలేవు. కొన్ని మధ్యలోనే తెగిపోతాయి. పతంగి ఆకాశానికి చేరుకున్నప్పుడే ఆనందాన్ని ఇస్తుంది. అలాగే సంపద సృష్టించుకోవాలనుకుంటే కొన్నిసార్లు నష్టాన్ని కూడా చవిచూడాల్సి ఉంటుంది. కష్టనష్టాలను ఓర్చుకుంటూ దీర్ఘకాల పెట్టుబడులను పెట్టినట్లైతే లాభాలను గడించవచ్చు.

ఇదీ చూడండి: డిజిటల్ రుణాలపై ఆర్​బీఐ వర్కింగ్ గ్రూప్

Last Updated : Jan 14, 2021, 12:06 PM IST

ABOUT THE AUTHOR

...view details