ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా ఐదు రాష్ట్రాలు అదనంగా రూ.16,728 కోట్ల రుణాలు పొందేందుకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ అంగీకరించింది. నిర్దేశించిన సులభతర వాణిజ్య సంస్కరణలను పూర్తి చేసిన కారణంగా ఆయా రాష్ట్రాలు ఈ వెసులుబాటును కల్పించింది.
అదనపు రుణాలను పొందేందుకు సులభతర వాణిజ్యంలో తాము తీసుకొచ్చిన సంస్కరణలను అమలు చేయాలని ఈ ఏడాది మే నెలలో సూచించింది ఆర్థికశాఖ. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక, మధ్యప్రదేశ్ అదనపు రుణాలు పొందేందుకు అర్హత సాధించాయి.