స్విస్ బ్యాంక్లో ఉన్న భారతీయుల ఖాతాల వివరాలపై కేంద్రం మౌనం వహిస్తోంది. గోప్యతా కారణాలు, ఇరు దేశాల మధ్య ఉన్న పన్ను ఒప్పందం వల్ల ఆ వివరాలు వెల్లడించలేమని కేంద్ర ఆర్థిక మంత్రత్వ శాఖ స్పష్టం చేసింది. విదేశాల నుంచి అందిన నల్లధనం వివరాలను కూడా బయటపెట్టలేమని తెలిపింది. సమాచార హక్కు చట్టం కింద దాఖలైన దరఖాస్తుపై ఈ విధంగా స్పందించింది ఆర్థిక శాఖ.
"పన్ను ఒప్పందాల వల్ల సమాచారాలు ఇచ్చిపుచ్చుకునే అంశం ఎంతో గోప్యంగా ఉంటుంది. అందువల్ల సమాచార హక్కు చట్టంలోని సెక్షన్ 8(1)(ఏ), 8(1)(ఎఫ్) కింద విదేశీ ప్రభుత్వాల నుంచి సేకరించిన పన్ను వివరాలను వెల్లడించడం కుదరదు."
- కేంద్ర ఆర్థికమంత్రిత్వశాఖ.