తెలంగాణ

telangana

ETV Bharat / business

'ఉద్యోగాలు కోల్పోయిన వారి వివరాలు సేకరించండి'

కరోనా సంక్షోభం కారణంగా ఉద్యోగాలు కోల్పోయిన వారి వివరాలు సేకరించాలని కార్మిక మంత్రిత్వశాఖను కేంద్ర ఆర్థిక శాఖ సూచించింది. అలాగే వేతనాల్లో కోతకు గురైన వారి సమాచారం కూడా సేకరించి అందజేయాలని పేర్కొంది.

Finance Ministry asks Labour Ministry to collect data on job losses due to COVID-19 crisis
'ఉద్యోగాలు కోల్పోయిన వారి గణాంకాలు సేకరించండి'

By

Published : May 29, 2020, 4:37 PM IST

కరోనా ప్రభావం ఉద్యోగులపై తీవ్రంగా పడింది. అనేకమంది తమ ఉద్యోగాలను కోల్పోయారు. మరికొంత మంది వేతనాల్లో కోతలు విధించాయి పలు సంస్థలు. దీంతో కరోనా కారణంగా నష్టపోయిన ఉద్యోగులపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఉద్యోగాలు కోల్పోయిన, వేతనాల్లో కోతకు గురైన వారి వివరాలను సేకరించాలని కార్మిక శాఖను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సూచించింది.

అంతేకాకుండా ప్రభుత్వ రంగ బ్యాంకులు ఇచ్చిన రుణాలు, పంపిణీ చేసిన రుణాల్లో వ్యత్యాసం ఉండటాన్ని కూడా ఆర్థిక శాఖ గుర్తించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. సమస్యల పరిష్కారానికి అన్ని చర్యలు తీసుకుంటుందని వెల్లడించాయి. అలాగే చైనా ద్వారా వచ్చే విదేశీ సంస్థల పెట్టుబడులపై (ఎఫ్​పీఐ) ఆంక్షల విధించటంపై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని ఆర్థిక శాఖ వర్గాలు పేర్కొన్నాయి.

ఇదీ చూడండి:ఆరంభ నష్టాల నుంచి తేరుకొని లాభాలతో ముగింపు

ABOUT THE AUTHOR

...view details