ఇంధనాన్ని వస్తుసేవల పన్ను (జీఎస్‌టీ) పరిధిలోనికి తెస్తే కేంద్రానికి ఎలాంటి అభ్యంతరం లేదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. బెంగళూరులో శుక్రవారం విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ... జీఎస్‌టీ పరిధిలోనికి డీజిల్, పెట్రోలును తెచ్చే నిర్ణయం జీఎస్‌టీ మండలి తీసుకుంటుందని గుర్తుచేశారు. ఇందుకు ప్రత్యేకంగా చట్టాన్ని సవరించాల్సిన అవసరమూ లేదన్నారు. రాష్ట్రాలకు చెల్లించే జీఎస్‌టీ పరిహారాన్ని కేంద్రం అడ్డుకుంటోందనే విపక్షాల ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. ఇంధన ధరలు పెరిగినా.. ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించే ప్రతిపాదన లేదన్నారు.
ఇంధనాన్ని జీఎస్‌టీ పరిధిలోకి తీసుకురావడంపై నిర్మల కీలక వ్యాఖ్యలు - వంట నూనెల ధరలపై నిర్మలా సీతారామన్
ఇంధనాన్ని జీఎస్‌టీ పరిధిలోకి తేవడంపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. ఈ విషయంపై కేంద్రానికి ఎలాంటి అభ్యంతరం లేదని పేర్కొన్నారు. ఇంధన ధరలు పెరిగినా.. ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించే ప్రతిపాదన లేదన్నారు.
నిర్మలా సీతారామన్ జీఎస్‌టీ
లాక్‌డౌన్ సందర్భంగా ఆర్థిక ప్యాకేజీలు ప్రకటించిన కేంద్రం ఈ లోటును పెంచిన ధరల నుంచి భర్తీ చేస్తుందన్న ఆరోపణలను మంత్రి తోసిపుచ్చారు. విదేశీ మార్కెట్‌లో ముడిచమురు బ్యారెల్ 75 డాలర్లకు చేరిందన్నారు. పప్పుధాన్యాలు, నూనెగింజల ఉత్పత్తి తగ్గి.. మయన్మార్, ఆఫ్రికా, కెనడాల నుంచి దిగుమతి చేసుకోవటం వల్ల నిత్యావసర ధరలు పెరిగాయన్నారు.
ఇదీ చదవండి :ఆరోగ్య బీమా..ఖర్చు కాదు..పెట్టుబడే..