Nirmala sitharaman: దేవాస్- ఆంథ్రిక్స్ ఒప్పందం మోసపూరితమైందని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఉటంకిస్తూ కాంగ్రెస్‌పై విమర్శల వర్షం కురిపించారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. కాంగ్రెస్ అవినీతికి ఇది నిదర్శనమని దుయ్యబట్టారు. సుప్రీం తీర్పుతో రూ.వేల కోట్ల ప్రజాధనాన్ని అవినీతి సంస్థకు చేరకుండా అడ్డుకునేందుకు అవకాశం దొరికిందని, దాన్ని కచ్చితంగా సద్వినియోగం చేసుకుంటామని చెప్పారు. ఉద్దేశపూర్వకంగానే యూపీఏ ప్రభుత్వం దేవాస్ సంస్థకు ఎస్-బ్యాండ్ శాటిలైట్ స్పెక్ట్రంను అతి తక్కువ ధరకు కేటాయించిందని ఆరోపించారు. 'అవినీతి'లో కాంగ్రెస్ మాస్టర్ అని దుయ్యబట్టారు.
Antrix devas deal
2005 జనవరిలో రెండు ఉపగ్రహాల ప్రయోగం, నిర్వహణ విషయంలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ వాణిజ్య విభాగం ఆంథ్రిక్స్, దేవాస్ మధ్య ఒప్పందం కుదిరింది. అయితే అయితే ఎస్ స్పెక్ట్రంను దేశ భద్రత కోసం రక్షణ శాఖ మాత్రమే వినియోగించుకోవాలనుకోవడం వల్ల 2011లో దేవాస్‌తో కుదుర్చుకున్న ఒప్పందాన్ని ఆంథ్రిక్స్ రద్దు చేసుకుంది. ఆంథ్రిక్స్కు వివిధ దేశాల్లో బ్రాంచీలు ఉండటం వల్ల అంతర్జాతీయ ట్రైబ్యునళ్లను ఆశ్రయించింది దేవాస్. ఒప్పంద రద్దు కావడం వల్ల తమకు నష్టం వాటిల్లిందని వాదించింది.