తెలంగాణ

telangana

ETV Bharat / business

ఆర్థికవ్యవస్థ పునరుద్ధరణకు మరిన్ని చర్యలు: నిర్మల ​ - జీఎస్టీ కౌన్సిల్​ చేతిలో జీఎస్టీ రేట్ల పెంపు నిర్ణయం

దేశ జీడీపీ వృద్ధిరేటు ఆరేళ్ల కనిష్ఠస్థాయికి పడిపోయిన నేపథ్యంలో ఆర్థికవ్యవస్థ పుంజుకునేందుకు ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకుంటుందని ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ పేర్కొన్నారు. జీఎస్టీ రేట్ల పెంపుపై జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు.

finance minister nirmala sitaraman about GST rates hike
ఆర్థికవ్యవస్థ పునరుద్ధరణకు మరిన్ని చర్యలు: నిర్మలా సీతారామన్​

By

Published : Dec 7, 2019, 2:48 PM IST

వస్తు, సేవల పన్ను జీఎస్టీ రేట్ల పెంపుపై జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంటుందని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్‌ తెలిపారు. జీఎస్టీ రేట్లను పెంచనున్నట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆర్థికమంత్రి​ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

దిల్లీలో ఓ జాతీయ మీడియా నిర్వహించిన సదస్సులో పాల్గొన్న నిర్మలా సీతారామన్‌ .. జీడీపీ వృద్ధిరేటు ఆరేళ్ల కనిష్ఠస్థాయికి పతనమైందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆర్థికవ్యవస్థ పుంజుకునేందుకు మరిన్ని చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు. ఆర్థికవ్యవస్థను గాడిలో పెట్టేందుకు ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో పలు ఉద్దీపన పథకాలు అమలు చేసినట్లు పేర్కొన్నారు. ఫలితంగా ప్రభుత్వ రంగ బ్యాంకులు గత రెండు నెలల్లో దాదాపు 5 లక్షల కోట్ల మేర రుణాలు ఇచ్చినట్లు తెలిపారు. ఆర్థిక కార్యకలాపాలు పుంజుకునేందుకు తీసుకోవాల్సిన మరిన్ని చర్యలపై ప్రభుత్వం దృష్టి సారించినట్లు నిర్మలా సీతారామన్‌ వివరించారు.

ఇదీ చూడండి: ఉత్తర్​ప్రదేశ్​లో మహిళలకు చోటేది: ప్రియాంక గాంధీ

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details