తెలంగాణ

telangana

ETV Bharat / business

పరారైంది 28 మంది- రప్పించింది 18మందిని - జాబితా

2014 నుంచి ఇప్పటి వరకు వివిధ నేరాలు చేసి మొత్తం 28 మంది దేశం నుంచి పరారయ్యారు. వీరిలో 18 మందిని దౌత్య మార్గాల్లో వెనక్కి తీసుకురాగలిగింది భారత్​.

భారత్

By

Published : Mar 22, 2019, 6:44 PM IST

Updated : Mar 23, 2019, 7:03 AM IST

విజయ్​మాల్యా, నీరవ్​ మోదీ, మెహుల్​ చోక్సీ ఇటీవల వార్తల్లో ప్రముఖంగా వినిపిస్తున్న పేర్లు. వీరందరూ ఆర్థిక నేరాలకు పాల్పడి దేశాన్ని విడిచివెళ్లిన వారే. మనకు తెలిసింది ఈ ముగ్గురు మాత్రమే.

కానీ ఆర్థిక నేరాలతో పాటు వివిధ రకాల మోసాలకు పాల్పడి గత ఐదేళ్లలో ఎంత మంది దేశం విడిచి పరారయ్యారో తెలుసా? 28 మంది. వీరిలో 18 మందిని వెనక్కి తీసుకురాగలిగింది భారత్.

వివిధ దేశాలకు పారిపోయిన ఈ 18 మందిని తీసుకురావటంలో భారతదేశం దౌత్య పరంగా ఎంతో కృషి చేసిందనే చెప్పాలి. ముఖ్యంగా ఆర్థిక నేరగాళ్లపై చర్యలకు 2018లో బ్యూనస్ ఎయిర్స్​లో జరిగిన జీ-20 సమావేశంలో 9 సూత్రాల అజెండాను ప్రతిపాదించింది భారత్. ఈ సూత్రాలే నేరాలకు పాల్పడి దర్జాగా విదేశాలకు చెక్కేస్తున్న వారిపట్ల యమపాశాలయ్యాయి.


భారత ప్రభుత్వం వెనక్కి తీసుకువచ్చింది వీరినే:

దేశ వ్యతిరేక చర్య
దేశ వ్యతిరేక చర్య
హత్య
హత్య
అగస్టా కేసు
అగస్టా కేసు
హత్యాయత్నం
హత్య
తీవ్రవాదం
హత్య
దేశ వ్యతిరేక చర్య
ఫోర్జరీ
మోసం
హత్యా నేరం
బ్యాంకు మోసం
నిరుద్యోగులకు వల
హత్యా నేరం


9 సుత్రాల్లోని ముఖ్యాంశాలు:

  • ఆర్థిక నేరాలు, అవినీతి, ఇతర నేరాలకు పాల్పడిన వారు సభ్య దేశాల్లో ఏదైనా దేశంలో తలదాచుకుంటే వారి సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవాలి.
  • ఆర్థిక నేరాలకు పాల్పడి విదేశాలకు పారిపోతున్న వారి ఆస్తులు సభ్య దేశాల్లో ఉంటే వాటిని జప్తు చేయాలి.
  • తమ దేశంలో తలదాచుకున్న ఆర్థిక నేరగాళ్ల పూర్తి సమాచారాన్ని సభ్య దేశాలతో పంచుకోవాలి.
  • తమ దేశంలో ఉన్న ఆర్థిక నేరగాళ్లపై సత్వర న్యాయ విచారణ చేపట్టి వారి దేశానికి వెంటనే అప్పగించేందుకు చర్యలు చేపట్టాలి.
  • తమ దేశానికి వచ్చేవారు ఏదైనా ఆర్థిక నేరానికి పాల్పడి ఉంటే వారిని దేశంలోకి అనుమతించకూడదు.
  • జీ-20 సభ్య దేశాల్లో ఐకరాజ్య సమితి చట్టాలు కట్టుదిట్టంగా అమలు చేయడానికి చర్యలు చేపట్టాలి.
  • నేరాల నివారణకు జీ-20 సభ్య దేశాలు ఒక వేదికను ఏర్పాటు చేయాలి. సభ్య దేశాల అధికారులకు నేర నియంత్రణలో శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలి.
Last Updated : Mar 23, 2019, 7:03 AM IST

ABOUT THE AUTHOR

...view details