తెలంగాణ

telangana

ETV Bharat / business

లాక్​డౌన్​ విధించొద్దని సీఎంలకు లేఖ - ఆర్థిక వ్యవస్థపై కరోనా ప్రభావం

భారీగా కరోనా కేసులు వెలుగు చూస్తున్న నేపథ్యంలో లాక్​డౌన్​ లాంటి నిర్ణయాలు తీసుకోవద్దంటూ 25 రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఫిక్కీ లేఖ రాసింది. గతేడాది విధించిన లాక్​డౌన్​తో కుదేలైన ఆర్థిక వ్యవస్థ ఇప్పుడిప్పుడే కోలుకుంటోందని.. ఇలాంటి తరుణంలో పాక్షిక, సంపూర్ణ లాక్​డౌన్​లు విధించడం మంచిది కాదని వివరించింది.

FICCI, FICCI letter to 25 CMs
లాక్​డౌన్​ విధించొద్దని ముఖ్యమంత్రులకు ఫిక్కీ లేఖ

By

Published : Apr 17, 2021, 6:24 PM IST

దేశంలోని 25 రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖ రాసింది ఫిక్కీ (ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఛాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ). దేశ వ్యాప్తంగా భారీగా వెలుగు చూస్తోన్న కరోనా కేసులను దృష్టిలో ఉంచుకొని లాక్​డౌన్​ కానీ.. పాక్షిక లాక్​డౌన్​ను కానీ విధించొద్దని తెలిపింది. గతేడాది విధించిన లాక్​డౌన్​లతో కుదేలైన ఆర్థిక వ్యవస్థ ఇప్పుడిప్పుడే కోలుకుంటుందని పేర్కొంది. ఈ తరుణంలో లాక్​డౌన్​ లాంటి నిర్ణయాలు తీసుకుంటే అవి ఆర్థిక వ్యవస్థను మరింత దిగజార్చుతాయని ఫిక్కి లేఖలో వివరించింది.

కొవిడ్​పై విజయం సాధించాలంటే లాక్​డౌన్ అనే నిర్ణయం సరైనది కాదన్నారు ఫిక్కీ ప్రెసిడెంట్​ ఉదయ్​ శంకర్​. ప్రత్యామ్నాయంగా టెస్టులను సంఖ్యను పెంచడం, అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం లాంటివి చేయడం ఉత్తమమని సూచించారు.

"మాస్క్​లు ధరించడం, భౌతిక దూరం, వ్యక్తిగత పరిశుభ్రత వంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ప్రజలు కరోనా నుంచి దూరంగా ఉండొచ్చు. పాఠశాలలు, కళాశాలలు, స్వచ్ఛంద సంస్థల నుంచి వచ్చే వలంటీర్ల మద్దతు తీసుకోవాలి. కొవిడ్​ ఆంక్షలను పాటించని వారిపై తగు జరిమాన విధించాలి."

- ఉదయ్​ శంకర్, ఫిక్కీ అధ్యక్షుడు

దేశవ్యాప్తంగా కొవిడ్​ పరీక్షలు నిర్వహించడాన్ని మరింతగా వేగవంతం చేయాలని ఇప్పటికే ప్రభుత్వాన్ని ఫిక్కీ కోరింది. అలాగే 18-45 ఏళ్ల వారికి టీకా వేయడాన్ని ప్రారంభించాలని విజ్ఞప్తి చేసింది. మహమ్మారితో ప్రభుత్వం చేస్తున్న పోరాటంలో పూర్తి మద్దతును పరిశ్రమ అందించేందుకు సిద్ధంగా ఉందని తెలిపింది.

ఇదీ చూడండి:'18-45 ఏళ్ల వారికి టీకా వేయాలి'

ABOUT THE AUTHOR

...view details