దేశవ్యాప్తంగా కొవిడ్-19 పరీక్షలు నిర్వహించడాన్ని మరింతగా వేగవంతం చేయాలని ప్రభుత్వాన్ని ఫిక్కీ కోరింది. అలాగే 18-45 ఏళ్ల వారికి టీకా వేయడాన్ని ప్రారంభించాలని విజ్ఞప్తి చేసింది. కొవిడ్-19 మహమ్మారితో ప్రభుత్వం చేస్తున్న పోరాటంలో పూర్తి మద్దతును పరిశ్రమ అందించేందుకు సిద్ధంగా ఉందని తెలిపింది.
ఈ మేరకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంరక్షణ శాఖ మంత్రి హర్ష వర్ధన్‌కు లేఖ రాశారు ఫిక్కీ అధ్యక్షుడు ఉదయ్ శంకర్.
'జనవరిలో రోజుకు 5 లక్షల శ్యాంపిల్స్‌ను పరీక్షించే స్థాయికి మనం చేరినప్పటికీ.. ప్రస్తుతం రోజుకు దాదాపు 11 లక్షల శ్యాంపిల్స్‌ను మాత్రమే పరీక్షిస్తున్నాం. అయితే.. మరిన్ని పరీక్షలను నిర్వహించేందుకు దేశవ్యాప్తంగా 2,440 ల్యాబ్‌లు అందుబాటులో ఉన్నాయి, ఇందులో 1,200 వరకు ప్రైవేట్ రంగానికి చెందినవి'