లాక్డౌన్తో కొనుగోళ్లు ఆగిపోయాయి. ప్రజలు నిత్యావసరాలు మినహా మిగతా వాటిపై ఖర్చు పెట్టలేదు. పండుగలు రావడం వల్ల ఇటీవలే కొనుగోళ్లు పెరుగుతున్నాయి. పండుగల సందర్భంగా ఈ కామర్స్ కంపెనీలు భారీ స్థాయిలో సేల్స్ చేపడుతున్నాయి. దీనికోసం ఆఫర్లను ప్రకటించాయి. అమెజాన్లో ఇన్నోవేటీవ్గా ఉన్న ఉత్పత్తులు, ఆవిష్కరణ స్థాయిలో ఉన్న మంచి ఉత్పత్తుల కోసం లాంచ్ ప్యాడ్ పేరిట ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. వీటిలో ఉన్న ఉత్పత్తులపై కమీషన్ను తక్కువగా తీసుకుంటుంది. అమెజాన్ లాంచ్ ప్యాడ్లో ఉన్న అంకురాల్లో కూడా పెట్టుబడులు పెట్టేందుకు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతారని ఇన్నోవేషన్ అండ్ స్టార్టప్స్, తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ రవితేజ గుప్తా తెలిపారు.
ఆన్లైన్లో కొనుగోళ్లకు మొగ్గుచూపుతున్నారు
ప్రస్తుతం పరిస్థితుల్లో ఆఫ్లైన్లో షాపింగ్ చేయాలంటే చాలా మంది భయపడుతున్నారు. ఆన్లైన్లో కొనుగోళ్లకు మొగ్గుచూపుతున్నారు. ప్రస్తుతం అంకురాలకు సంబంధించి పరిస్థితి సాధారణంగా ఉందని అంకురాల ప్రతినిధులు చెబుతున్నారు. లాక్డౌన్ కొన్ని అంకురాలకు అనుకూలంగా ఉండగా, కొన్నింటిపై ప్రతికూలంగా ప్రభావం చూపినప్పటికీ.. పరిస్థితిని బట్టి మంచి ఫలితాలను సాధిస్తున్నాయని తెలిపారు. పెద్ద పెద్ద కంపెనీలే మార్కెట్కు అనుగుణంగా మారుతున్నప్పుడు, చిన్న అంకురాలు రోజు వారీగా మారాల్సిన పరిస్థితి ఉంటుందని వారు సూచిస్తున్నారు.