తెలంగాణ

telangana

ETV Bharat / business

హానర్​ నుంచి 2 బడ్జెట్ ఫోన్లు- ధర తెలిస్తే షాకే! - హానర్ 9ఏ ధర

లాక్​డౌన్​ తర్వాత జోరు పెంచాయి స్మార్ట్​ఫోన్​ తయారీ సంస్థలు. ఇందులో భాగంగా కంపెనీ హానర్​ దేశీయంగా రెండు బడ్జెట్ ఫోన్లను విడుదలకు సిద్ధమైంది. హానర్​ 9ఏ, 9ఎస్​ పేర్లతో రానున్న ఈ మోడళ్ల ఫీచర్లు, ధరల వివరాలు ఇలా ఉన్నాయి.

budget phones from honor
హానర్ కొత్త బడ్జెట్ ఫోన్లు

By

Published : Jul 20, 2020, 4:45 PM IST

ప్రముఖ స్మార్ట్​ఫోన్ల తయారీ సంస్థ హానర్ దేశీయ విపణిలోకి రెండు బడ్జెట్ ఫోన్లను తీసుకురానుంది. హానర్ 9ఏ, హానర్​ 9ఎస్​ పేర్లతో ఈ నెలాఖరులోపు వీటిని విపణిలోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది.

9ఏ మోడల్​ను ఇటీవలే చైనాలో ఆవిష్కరించింది హానర్​. దీని ధర దాదాపు 1200 యువాన్లుగా (రూ.12 వేలకు పైమాటే). భారత్​లోను ఇంచుమించు అదే ధరకు అందుబాటులోకి తేవచ్చని తెలుస్తోంది. హానర్ 9ఎస్​ ధర రూ.7 వేల లోపే ఉండొచ్చని అంచనాలు ఉన్నాయి.

ఈ రెండు మోడళ్ల ఫీచర్ల అంచనాలు ఇలా ఉన్నాయి.

హానర్ 9ఏ

  • 6.3 అంగుళాల డిస్​ప్లే
  • మీడియాటెక్ ఎంటీ6765 ఎస్​ఓసీ ప్రాసెసర్
  • 3 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజి
  • వెనుక వైపు మూడు కెమెరాలు (13ఎంపీ,+5ఎంపీ,+ 2ఎంపీ)
  • 8 ఎంపీ సెల్ఫీ కెమెరా
  • 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ

హానర్ 9ఎస్​ బడ్జెట్ ఫోన్​..

  • 5.45 అంగుళాల డిస్​ప్లే
  • మీడియాటెక్ ఎంటీ6762 ఎస్​ఓసీ ప్రాసెసర్
  • 2జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజి
  • 8ఎంపీ రియర్ కెమెరా
  • 5ఎంపీ సెల్ఫీ కెమెరా
  • 3,020 ఎంఏహెచ్​ బ్యాటరీ

ఇదీ చూడండి:తప్పు జరిగింది.. క్షమించండి: ట్విట్టర్

ABOUT THE AUTHOR

...view details