యాపిల్ తన వైర్లెస్ ఓవర్-ఇయర్ ఎయిర్ పాడ్స్‌ను డిసెంబర్ 8న ఆవిష్కరించింది. అత్యద్భుతమైన క్వాలిటీ ఆడియో, యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్, స్పాటియల్ ఆడియో వంటి ఫీచర్లతో వచ్చిన ఈ ఇయర్ ఫోన్స్ యాపిల్ అభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
యూజర్ ఫ్రెండ్లీ డిజైన్, హెచ్1 చిప్స్, అధునాతన సాఫ్ట్‌వేర్‌తో వీటిని వినియోగదారుల కోసం తీసుకువచ్చింది యాపిల్. ప్రస్తుతం గ్రే, సిల్వర్, స్కై బ్లూ, గ్రీన్, పింక్ రంగుల్లో లభించే ఈ ఇయర్ ఫోన్ల ధర రూ.59,900గా ఉంది. వీటిలో ఉన్న ప్రత్యేక ఫీచర్లు ఏంటో ఇప్పుడు చూద్దాం.
- వినియోగదారుడికి కచ్చితమైన ధ్వని అనుభూతినిచ్చేలా ఎయిర్ పాడ్స్లోని ప్రతిభాగాన్ని అత్యంత జాగ్రత్తతో రూపొందించారు.
- రెవల్యూషనరీ మెకానిజమ్ ద్వారా ధ్వని.. చెవికి రెండువైపులా సమంగా వినిపిస్తుంది.
- అడాప్టివ్ ఈక్యూ డిజైన్ వల్ల చెవులకు సరిగ్గా సరిపోయేలా పెట్టుకోవచ్చు. తల కావాల్సిన వైపు సులభంగా తిప్పొచ్చు.
- యాక్టివ్ వాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ సాయంతో బయటి శబ్దాలు ఏ మాత్రం రావు.
- శబ్దాన్ని నియంత్రించడానికి యాపిల్ వాచ్‌ల్లో ఉండే డిజిటల్ క్రౌన్ సదుపాయాన్ని దీనికి జతచేశారు.
- ట్రాన్సపరెన్సీ మోడ్ ఈ ఎయిర్‌పాడ్స్‌లో ఉంది. దీని సాయంతో ఏకకాలంలో బయట ఆడియోను, ఇయర్ ఫోన్ల నుంచి వచ్చే ఆడియోను వినవచ్చు.
- ఈ ఎయిర్‌పాడ్స్‌లో అట్మాస్‌లో ఆడియో రికార్డు చేస్తుంది. అది వింటే థియేటర్ లాంటి అనుభూతి సొంతమవుతుంది.
- 20 గంటల బ్యాటరీ సామర్థ్యం ఉంటుంది.
- యాపిల్ ఐఓస్ 14.3, లేదా ఐప్యాడ్ ఓఎస్ లాంటి ఆపరేటింగ్ సాయంతో ఇవి పనిచేస్తాయి.