చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ షియోమీ.. రెడ్మీ సిరీస్లో మరో రెండు ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేసింది. రెడ్మీ నోట్-9, నోట్-9 ప్రో ఫోన్లను ఓ ఆన్లైన్ కార్యక్రమం ద్వారా వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. ఈ మోడల్ ఫోన్లు స్టైలిష్ సిమెట్రిక్ డిజైన్లో.. ఫారెస్ట్ గ్రీన్, పోలార్ వైట్, మిడ్నైట్ గ్రే వంటి మూడు రంగుల్లో లభించనున్నాయి.
రెడ్మీ నోట్-9 ప్రత్యేకతలు:
- 6.53 అంగుళాల ఫుల్హెచ్డీ,డాట్ డిస్ప్లే
- హీలియో జీ85 ప్రాసెసర్
- వెనుకవైపు 48 ఎంపీ ప్రధాన కెమెరాతో కలిపి నాలుగు కెమెరాలు
- 13 ఎంపీ సెల్ఫీ కెమెరా
- 5,020 ఎంఏహెచ్ బ్యాటరీ
- 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్