డిజిటల్ పద్ధతిలో జాతీయ రహదార్లపై టోల్ వసూలు చేసేందుకు ప్రవేశపెట్టిన ఫాస్టాగ్లపై జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ(ఎన్హెచ్ఏఐ) మరో కీలక నిర్ణయం తీసుకుంది. వాటి వినియోగం పెంచేందుకు ఈ నెల 29 వరకు ఫాస్టాగ్ల కొనుగోలుకు రూ.100 రుసుము వసూలు చేయొద్దని నిర్ణయించింది.
దేశవ్యాప్తంగా జాతీయ రహదార్లపై ఉన్న 527 టోల్ ప్లాజాల వద్ద ఎలక్ట్రానిక్ పద్ధతిలో ఎన్హెచ్ఏఐ టోల్ వసూలు చేయడం ఇప్పటికే ప్రారంభించిన విషయం విధితమే.
ఏదైన అధికారిక ఫాస్టాగ్ పాయింట్ ఆఫ్ సేల్ వద్ద.. గుర్తింపు పొందిన రిజిస్ట్రేషన్ పత్రాలు చూపించి ఉచితంగా ఫాస్టాగ్ పొందొచ్చని రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఎక్కడెక్కడ అందుబాటులో ఉన్నాయి?