తెలంగాణ

telangana

ETV Bharat / business

'ఫాస్టాగ్'లో లొసుగులు- మోసగాళ్లకు కాసులు

టోల్​ ప్లాజాల వద్ద ఆగాల్సిన పని లేకుండా.. సులభంగా టోల్​ రుసుము చెల్లించేందుకు ఫాస్టాగ్​ విధానాన్ని తీసుకువచ్చింది కేంద్రం. అయితే.. ఈ ఇందులోని లొసుగులను వాడుకుని కొంతమంది మోసాలకు దిగుతున్నారు. టోల్​ చెల్లించకుండానే ఉడాయిస్తున్నారు. ఇలాంటి మోసాలకు పాల్పడిన కొన్ని వాహనాలకు ఇప్పటికే అధికారులు సీజ్ చేశారు.

FASTag and its scams in india
ఫాస్టాగ్ విధానంలో లొసుగులు.. మోసగాళ్లకు లాభాలు!

By

Published : Mar 25, 2021, 6:36 PM IST

జాతీయ రహదారులపై టోల్​ ఫీజు వసులు చేసేందుకు ఫాస్టాగ్​ విధానాన్ని అమలు చేస్తోంది కేంద్రం. ఈ ఏడాది ఫిబ్రవరి 15 నుంచి ప్రతి వాహనానికి ఫాస్టాగ్ తప్పనిసరి. ఫాస్టాగ్ లేని వాహనాలు టోల్ గేట్ల వద్ద రెట్టింపు రుసుము చెల్లించాల్సి ఉంటుందని కేంద్రం తేల్చి చెప్పింది.

నిబంధనలు కఠినతరం చేసిన నేపథ్యంలో ఇప్పటికే.. 93 శాతం మంది వాహనదారులు ఫాస్టాగ్ తీసుకున్నట్లు వెల్లడించారు కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్​ గడ్కరీ వెల్లడించారు. 7 శాతం మంది రెట్టింపు టోల్ రుసుము చెల్లిస్తున్నట్లు తెలిపారు.

టోల్​ ప్లాజాల వద్ద ఆగాల్సిన పని లేకుండా.. సులభంగా టోల్​ రుసుము బ్యాంక్ ఖాతా నుంచి చెల్లింపు జరిగేలా చూసేదే ఈ ఫాస్టాగ్​. దీని వల్ల ఇంధనం, సమయం ఆదా అవడం సహా టోల్ చెల్లింపు ప్రక్రియ జరుగుతుందన్నది కేంద్రం ముఖ్య ఉద్దేశం. అయితే ఇందులో ఉన్న చిన్న చిన్న లొసుగులను వాడుకుని టోల్​ రుసుము విషయంలో మోసాలకు దిగుతున్నారు.

బస్సుకు బొలేరో ట్యాగ్​..

ఆర్​జే-19 పీఏ 8611 నంబర్​ కలిగిన ఓ ప్రైవేట్ బస్​​.. ఆర్​జే-19 యూబీ-4973 నంబర్​తో ఉన్న ఓ బొలెరో వాహనానం ట్యాగ్​తో.. జోధ్​పుర్​ నుంచి జై సల్మేర్​ మధ్య మూడు టోల్ ప్లాజాలను దాటుకుంటూ వెళ్లింది. ఈ మూడు గేట్ల ఆ బస్సు వద్ద రూ.900 టోల్ రుసుము కట్టాల్సి ఉండగా.. బొలేరో ట్యాగ్ ఉండటం వల్ల (జీప్​, కార్ కేటగిరీ) రూ.270 మాత్రమే చెల్లించింది.

ఆ వాహనానికి ఉన్న ట్యాగ్​ స్కాన్ అవగానే గేట్లు ఆటోమేటిగ్​గా తెరుచుకుంటాయి. దీని వల్ల అది బొలేరోనా, బస్సా అని తెలుసుకునే వీలు లేదు. టోల్ ప్లాజా అధికారులు ఈ మోసాన్ని ఆలస్యంగా గుర్తించారు.

మంగళూరులో కొత్త తరహా మోసం..

ప్రైవేటు బ్యాంకులు, ఈ-సర్వీస్​ సెంటర్ల ద్వారా జారీ చేస్తున్న ఫాస్టాగ్​ స్టిక్కర్లకు సంబంధించిన ఓ భారీ మోసం మంగళూరులో బయటపడింది. ట్రక్కుల వంటి భారీ వాహనాలకు.. చిన్న చిన్న వాహనాలకు జారీ చేసే స్టిక్కర్లను అతికించి.. వాటి ద్వారా టోల్ ప్లాజాల ద్వారా ప్రయాణాలు సాగిస్తున్నారు. దీని వల్ల హెవీ వాహనాలు టోల్ ప్లాజాలను వినియోగించుకున్నా తక్కువ ఫీజునే చెల్లిస్తున్నాయి. ఈ మోసం జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ(ఎన్​హెచ్​ఏఐ) దృష్టికి కూడా వెళ్లింది. త్వరలోనే దీనిపై ఓ నిర్ణయం తీసుకుంది.

వాహన యజమానులు కుమ్మక్కై..

మల్టీ యాక్సిల్​ వాహనాలు (ఎంఏవీ), లైట్​ కమర్షియల్ వెహికిల్స్ (ఎల్​సీవీ) యజమానులు కుమ్మకై మరో కొత్త రకం ఫాస్టాగ్ మోసాలకు పాల్పడుతున్నారు. ఎల్​సీవీ రిజిస్ట్రేషన్ పేపర్లతో.. ఫాస్టాగ్​లు కొనుగోలు చేసి వాటిని ఎంఏవీ వాహనాలకు ఉపయోగిస్తున్నారు.

ఎన్​హెచ్​ఏఐ హెచ్చరిక..

కొంత మంది మోసగాళ్లు అసలైన ఫాస్టాగ్​లలానే కనిపించే నకిలీ ట్యాగ్​లను విక్రయిస్తున్నట్లు గుర్తించిన నేపథ్యంలో వాహనదారులు. https://ihmcl.co.in (అధికారిక వెబ్​సైట్​) లేదా మైఫాస్టాగ్ యాప్​ ద్వారానే ట్యాగ్​లను కొనుగోలు చేయాలని సూచించింది ఎన్​హెచ్​ఏఐ. ఇంకా ఏవైనా మోసాలను గమనిస్తే.. 1033కి కాల్​ చేసి ఫిర్యాదు చేయాలని చెబుతోంది.

ఇదీ చదవండి:సైబర్​ నేరగాళ్ల వల నుంచి ఇలా తప్పించుకోండి..

ABOUT THE AUTHOR

...view details