తెలంగాణ

telangana

ETV Bharat / business

'స్పైస్​జెట్​.. మీ డిస్కౌంట్ సేల్​ను నిలిపివేయండి'

స్పైస్​జెట్ ప్రారంభించిన ఐదురోజుల డిస్కౌంట్ సేల్​ను నిలిపివేయాలని ఆ సంస్థను డీజీసీఏ ఆదేశించింది. ప్రభుత్వం అమలు చేస్తున్న ఛార్జీల పరిమితులు అమలులో ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది డీజీసీఏ. అయితే డీజీసీఏ మార్గదర్శకాలకు అనుగుణంగానే నడుచుకున్నట్లు స్పైస్​జెట్ ప్రకటించింది.

Fare bands in place, DGCA asks SpiceJet to stop sale that gives discount coupons
'స్పైస్​జెట్​.. మీ డిస్కౌంట్ సేల్​ను నిలిపివేయండి'

By

Published : Aug 4, 2020, 5:35 AM IST

ప్రైవేట్ ఎయిర్​లైన్ స్పైస్​జెట్ ప్రారంభించిన టికెట్ల డిస్కౌంట్ అమ్మకాలను నిలిపివేయాలని నియంత్రణ సంస్థ డీజీసీఏ ఆ సంస్థకు ఆదేశాలు జారీ చేసింది. మే 25న దేశీయ విమాన సర్వీసులు ప్రారంభమైన తర్వాత రుసుములపై పరిమితులు ఉన్న నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

మార్గదర్శకాల ప్రకారమే..

ఈ విషయంపై స్పందించిన స్పైస్​జెట్.. డీజీసీఏ మార్గదర్శకాలకు అనుగుణంగానే నడుచుకున్నట్లు తెలిపింది.

ఐదు రోజుల వన్​ ప్లస్ వన్ ఆఫర్ సేల్​ను ప్రారంభిస్తున్నట్లు సోమవారం ప్రకటించింది స్పైస్​జెట్. ఇందులో భాగంగా వన్​వే టికెట్ ధర అతి తక్కువగా... రూ. 899గా నిర్ణయించింది. డిస్కౌంట్ సమయంలో టికెట్లు బుకింగ్ చేసుకున్న వారికి కాంప్లిమెంటరీ వోచర్లు అందించనున్నట్లు వెల్లడించింది.

కొత్త ఛార్జీలు

ప్రయాణ సమయం ఆధారంగా విమాన ఛార్జీల వివరాలను మే21న పౌర విమానయాన మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. ఏడు విభాగాలు ఏర్పాటు చేసిన ఛార్జీలను నిర్ణయించింది. ఆగస్టు 24 వరకు ఇవే ఛార్జీలు అమలులో ఉంటాయని స్పష్టం చేసింది. అనంతరం ఈ సమయాన్ని నవంబర్ 24 వరకు పొడగించింది.

ABOUT THE AUTHOR

...view details