వైద్య చికిత్స ఎంత ఖరీదైన విషయమో.. కొవిడ్-19 రెండో దశ మనకు చూపించింది. ఎంతోమంది ఆసుపత్రి బిల్లులు చెల్లించలేక అప్పుల పాలైన విషయమూ మనం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో ఒక కుటుంబానికి ఆరోగ్య బీమా అవసరం ఎంత ఉందనేదీ ప్రత్యక్షంగా తెలుసుకున్నాం. దీంతో ఇప్పుడు చాలామంది ఈ బీమా పాలసీలను తీసుకునేందుకు ముందుకు వస్తున్నారు. అయితే, కుటుంబానికి అంతటికీ వర్తించే బీమా పాలసీ తీసుకునేటప్పుడు ఏం జాగ్రత్తలు తీసుకోవాలన్న విషయాన్ని తప్పకుండా తెలుసుకోవాలి.
ఎవరెవరికి..
కుటుంబం అంటే.. దంపతులిద్దరితోపాటు వారి మీద ఆధారపడిన పిల్లలను ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీలో చేర్పించవచ్చు. పిల్లలకు 23 నుంచి 25 ఏళ్లు లేదా వివాహం అయ్యేదాకా ఈ రెండింటిలో ఏది ముందైతే అప్పటి వరకూ ఈ పాలసీలో సభ్యులుగా కొనసాగే వీలుంది. కొన్ని బీమా సంస్థలు తల్లి, తండ్రి, అత్త, మామ, నాన్నమ్మ, తాతయ్యలనూ కుటుంబ పాలసీలో చేర్పించుకునే వీలును కల్పిస్తున్నాయి. పాలసీ మొత్తం.. ఆ పాలసీలో ఉన్న వారందరికీ నిబంధనల మేరకు వర్తిస్తుంది.
కుటుంబంలో సీనియర్ సిటిజన్లు ఉన్నప్పుడు వారిని కుటుంబ పాలసీలో చేర్పించడం వల్ల పాలసీ ప్రీమియం పెరిగే అవకాశం ఉంది. పైగా వారికి ఆరోగ్య సమస్యలు కూడా ఎక్కువగానే ఉంటాయి. ఇలాంటప్పుడు వారు అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరితే.. పాలసీ మొత్తం వారికే ఖర్చయితే.. మిగతా వారికి ఇబ్బందులు తప్పకపోవచ్చు. సాధారణంగా ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీలో ఉన్న సభ్యుల్లో ఎవరికి ఎక్కువ వయసు ఉంటుందో వారిని ప్రాథమికంగా తీసుకొని, పాలసీ ప్రీమియాన్ని నిర్ణయిస్తారు. ఇలాంటప్పుడు ప్రీమియం అధికంగా చెల్లించాల్సి వస్తుంది. దీనికి బదులుగా సీనియర్ సిటిజన్లు లేదా ఎక్కువ వయసు ఉన్న వారి కోసం ప్రత్యేకంగా వ్యక్తిగత పాలసీ తీసుకొని, మిగతా వారిని ఫ్యామిలో ఫ్లోటర్ పాలసీలో చేర్పించేందుకు ఆలోచించాలి. దీనివల్ల ప్రీమియం భారం లేకుండా.. అందరికీ.. గరిష్ఠ పాలసీ రక్షణ అందేందుకు అవకాశం ఉంటుంది.
ఎంత మొత్తంలో..