తెలంగాణ

telangana

ETV Bharat / business

యాప్​లతో జర భద్రం

ఈ మధ్యకాలంలో నకిలీ యాప్​ల హవా ఎక్కువైపోయింది. వీటిని ఇన్​స్టాల్​ చేసుకుని డబ్బులు పొగొట్టుకుంటున్నారు వినియోగదారులు.

By

Published : Mar 2, 2019, 3:24 PM IST

నకిలీ యాప్​

ఈ యాప్​తో లావాదేవీలు చేస్తే మీకు 50 శాతం క్యాష్​ బ్యాక్​.. ఈ యాప్​తో డబ్బు చెల్లించండి 1000 రూపాయిల వరకు నగదు పొందే అవకాశం... ఈ యాప్ ద్వారా​ మీ బిల్లులు చెల్లిస్తే మీరు సగం మాత్రమే చెల్లించొచ్చు..

ఇలాంటి ప్రకటనలు తరచూ అంతర్జాలంలో చూస్తునే ఉంటాం. డిజిటల్​ లావాదేవీలు మంచిదే కానీ ఇటీవల వస్తున్న నకిలీ యాప్​లతో నష్టపోతున్నారు చాలామంది. కష్టపడి రూపాయి... రూపాయి కూడబెట్టిన సొమ్మును ఒక్క క్లిక్​తో దోచేస్తున్నాయి దొంగ యాప్​లు.

గుగూల్​ ప్లేస్టోర్​లో లెక్కలేనన్ని ఈ-వాలెట్స్​ ఉన్నాయి. వీటిలో నకిలివే అధికం. సరైన జాగ్రత్తలు పాటించకుండా వీటిని వినియోగిస్తే ఖాతాల్లో సొమ్ము క్షణాల్లో మాయమవుతుంది.

1.డిజిటల్​ ఏటీఎం:

'డిజిటల్​ భారత్'​ అని ప్రధాని మోదీ ప్రకటించగానే గుగూల్​ ప్లే స్టోర్​లో​ వాలిపోయాయి నకీలీ యాప్​లు. ఇందులో డిజిటల్​ ఏటీఎం ఒకటి. ఇది ఇన్​స్టాల్​ చేసుకునే సమయంలో యూజర్​ నేమ్​, పాస్​వర్డ్​తో సహా ఇతర బ్యాంకు వివరాలు అడుగుతోంది. ఇవి నమోదు చేశారంటే అంతే బ్యాంకు ఖాతాలో సొమ్ము స్వాహా అయిపోతుంది.
ఈ యాప్​కి వీరు ప్రధాని మోదీ, ఆర్బీఐ బ్యాంకుల చిత్రాలు వాడటం గమనార్హం.

2.ఎనీడెస్క్​:

సైబర్​ నేరగాళ్లకు ఎంతో ఇష్టమైన యాప్​ ఎనీడెస్క్​. ఘరానా దొంగలు దీనిని సులభంగా హ్యాక్​​ చేస్తున్నారు. వినియోగదారుల ఖాతాల వివరాలు, ఫోన్​ నెంబర్లు సేకరించి డబ్బులు తస్కరిస్తున్నారు. ఈ మేరకు ఆర్బీఐ ఐటీ విభాగం ప్రకటన విడుదల చేసింది.

ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే. చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉన్నాయి.

మరి ఏవి వాడాలి:

1. కేవలం బ్యాంకులు, రిజర్వ్​ బ్యాంకు గుర్తించిన యాప్​లు మాత్రమే వినియోగించాలి.

2.నిజమైన యాప్​లైతే వార్తా పత్రికల్లోనూ, టెలివిజన్​ ద్వారా ప్రకటనలిస్తాయి. వీటిని మాత్రమే ఇన్​స్టాల్​ చేసుకోవాలి.

3.కొన్ని యాప్​లు ఆచరణకు సాధ్యం కాని ఆఫర్లు ప్రకటిస్తుంటాయి. వీటి పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలి.

నకిలీవీ గుర్తించడం ఎలా..?

1. గుగూల్​ ప్లేస్టోర్​ నుంచి యాప్​ ఇన్​స్టాల్​ చేసుకునేముందు దాని రేటింగ్​ చూడాలి. నకిలీ యాప్​లకు రేటింగ్​ చాలా తక్కువుగా ఉంటుంది.

2.అసలైన యాప్​లో ప్రకటనలు చాలా తక్కువగా ఉంటాయి. ప్రకటనలు ఎక్కువవగా వస్తుంటే అది నకిలీదయ్యే అవకాశముంది.

3.యాప్​ ఇన్​స్టాల్​ చేసుకునేముందు అన్ని నిబంధనలు జాగ్రత్తగా చదవండి.

4. యాప్​ సంబంధిత సమాచారాన్ని గుగూల్​లో తెలుసుకోవడంతో పాటు, ఇది ఇన్​స్టాల్​ చేసుకోవడం మంచిదేనా అని గుగూల్​లో శోధిస్తే యాప్​ గురించి కచ్చితమైన సమాచారం వస్తుంది.

ABOUT THE AUTHOR

...view details