డిసెంబర్ త్రైమాసికంలో.. విద్వేషపూరిత సమాచారానికి చెందిన 2కోట్ల 69లక్షల పోస్టులను తొలగించినట్టు ఫేస్బుక్ ఇండియా వెల్లడించింది. విద్వేష సమాచారానికి సంబంధించిన వీక్షణలు కూడా భారీగా తగ్గించినట్టు పేర్కొంది. వీటికి అంతర్జాతీయంగా 10వేల వీక్షణలు వస్తుంటే.. దేశంలో ఆ సంఖ్య 7-8 మాత్రమే ఉంటోందని స్పష్టం చేసింది.
2.69కోట్ల విద్వేష పోస్టులు తొలగించిన ఫేస్బుక్
2020 డిసెంబర్ త్రైమాసికంలో 2కోట్లకు పైగా విద్వేష సమాచారన్ని ఫేస్బుక్ నుంచి తొలగించినట్లు ఆ సంస్థ తెలిపింది. వాటి వీక్షణలను కూడా గణనీయంగా తగ్గించినట్లు పేర్కొంది.
2కోట్లకు పైగా విద్వేష సమాచారాన్ని తొలగించిన ఫేస్బుక్!
ఫేస్బుక్కు ప్రపంచవ్యాప్తంగా 184 కోట్ల మంది యూజర్లు ఉన్నారు. వీరిలో భారతీయులే అధికం. అయితే గత కొంత కాలంగా విద్వేషపూరిత సమాచారం నేపథ్యంలో సామాజిక మాధ్యమ దిగ్గజం.. తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో వాటిని తగ్గించినట్టు ఫేస్బుక్ చేసిన ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇదీ చూడండి:ఖాతాల తొలగింపునకు తలొగ్గిన ట్విట్టర్