ఫేస్బుక్లో కరోనాపై వచ్చిన పోస్టులకు లైక్ కొడుతూ, కామెంట్లు పెడుతున్నారా? అయితే జాగ్రత్త. పొరపాటున వైరస్‌కు సంబంధించి ఏదైనా అసత్య సమాచారాన్ని వ్యాప్తి చేస్తే వెంటనే మీకు వార్నింగ్ ఇస్తుంది ఫేస్బుక్.
కచ్చితమైన సమాచారం అయితేనే...
వైరస్‌పై అసత్య ప్రచారాలను అరికట్టేందుకు ఫేస్బుక్ సహా ఇతర ప్లాట్‌ఫాంలు ఇప్పటికే చర్యలు తీసుకోవడం ప్రారంభించాయి. వైరస్ పుట్టుక, వ్యాక్సిన్ల తయారీ గురించి దుష్ప్రచారం జరుగుతోందని ఫేస్బుక్ తెలిపింది. అధికారికంగా ధ్రువీకరించని చికిత్సలు, నివారణలను ప్రోత్సహించే పోస్టులు, వీడియోలను ప్రస్తుతం వేలాది మంది వీక్షించినట్లు పేర్కొంది.