భారత్‌లో తమ మొబైల్ యాప్‌లో వ్యాక్సిన్ సమాచారం (ఫైండర్ టూల్) అందించేందుకు ప్రభుత్వంతో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు ఫేస్‌బుక్ వెల్లడించింది. ప్రజలు తమ సమీప ప్రదేశాల్లో వ్యాక్సిన్ పొందేందుకు వీలుగా 17 భాషల్లో వ్యాక్సిన్ ఫైండర్ టూల్‌ను తీసుకొచ్చినట్లు వివరించింది.
ఈ టూల్‌లో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ నిర్వహించే వ్యాక్సిన్ కేంద్రాలు, నిర్వహణ సమయం వంటి వివరాలు లభిస్తాయి. దీని సాయంతో 45 ఏళ్లు పైబడిన వారికి సత్వర వ్యాక్సిన్ అవకాశాలు, కొవిన్ వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్, వ్యాక్సిన్ అపాయింట్‌మెంట్ వంటివి చేసుకోవచ్చని ఫేస్‌బుక్ పేర్కొంది.