తెలంగాణ

telangana

ETV Bharat / business

ఫేస్​బుక్​లోనూ 'షార్ట్​ వీడియోస్​' ఫీచర్ - ఫేస్​బుక్​లో కొత్త ఫీచర్లు

టిక్​టాక్​ను మరిపించేలా షార్ట్​ వీడియో కోసం ఫేస్​బుక్​ కొత్త ఫీచర్​ను పరీక్షిస్తోంది. ఇటీవలే ఇన్​స్టాగ్రామ్​లో రీల్స్​ ఫీచర్​ను అందుబాటులోకి తెచ్చిన ఫేస్​బుక్​.. తమ ప్రధాన యాప్​లోనూ అలాంటి ఫీచర్​ను తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ఇప్పటికే కొంత మందికి ప్రయోగాత్మకంగా ఈ ఫీచర్​ను అందుబాటులో ఉంచింది.

short video feature in fb
ఫేస్​బుక్​లో షార్ట్​ వీడియో ఫీచర్​

By

Published : Aug 18, 2020, 12:40 PM IST

దేశంలో టిక్​టాక్​ను నిషేధించిన తర్వాత.. చాలా సంస్థలు దాని మార్కెట్​ను దక్కించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఇందుకోసం చాలా సంస్థలు షార్ట్‌ వీడియో యాప్‌లు రూపొందిస్తున్నాయి. మరికొన్ని సంస్థలు మాత్రం ఉన్న యాప్‌లలో షార్ట్‌ వీడియో ఫీచర్​ను తీసుకొస్తున్నాయి. తాజాగా ఫేస్‌బుక్‌ కూడా అదే దారిలోకి వచ్చింది.

కొత్త యాప్‌ను తీసుకురాకుండా... ఉన్న యాప్‌లోనే షార్ట్‌ వీడియో అనే ఫీచర్‌ తీసుకొస్తోంది ఫేస్​బుక్​. ఇప్పటికే కొంతమందికి ఈ ఫీచర్‌ ప్రయోగాత్మకంగా అందుబాటులో ఉంది. న్యూస్‌ఫీడ్‌ మధ్యలో బ్లాక్స్‌లా షార్ట్ వీడియోస్‌ కనిపిస్తాయి. దీని ద్వారా యూజర్స్‌ తక్కువ నిడివి ఉన్న వీడియోలను రూపొందించవచ్చు. వీక్షించొచ్చు కూడా.

వాట్సాప్‌ స్టేటస్‌, ఫేస్‌బుక్‌ స్టోరీ తరహాలో మన వీడియోకి వచ్చిన వ్యూస్‌ ఎన్ని అనేది కూడా తెలుసుకోవచ్చు. నిజానికిది ఫేస్‌బుక్‌కు కొత్తేం కాదు.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఇటీవలే రీల్స్‌ అని ఓ ఫీచర్​ను ఇటీవలే తీసుకొచ్చింది. దానినే పేరు మార్చి ఫేస్​బుక్​లో ఉంచింది.

ఇదే తరహాలో యూట్యూబ్ కూడా షార్ట్‌ పేరుతో వీడియో ఫీచర్‌ని అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది. మరికొన్ని సంస్థలు ఇలాంటి యాప్స్‌ తీసుకురావాలని చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఫేస్‌బుక్‌ ఇలాంటి షార్ట్‌ వీడియోలు తీసుకురావడం గమనార్హం.

దేశీయ యాప్​ల దూకుడు..

ఇప్పటికే భారత్ మార్కెట్లో రోపోసో, మోజ్, జోష్, ఎంఎక్స్‌ టకాటక్, చింగారీ, ట్రెల్లో, మిత్రోన్‌, రీల్స్‌, హాట్‌షాట్స్ వంటి షార్ట్‌ వీడియోల యాప్‌ల డౌన్‌లోడ్‌లు పెరిగాయి.

తాజా డేటా ప్రకారం రోపోసో 70 మిలియన్‌, మోజ్ 50 మిలియన్, టకాటక్ 33 మిలియన్, మిత్రోన్ 23 మిలియన్ మంది డౌన్‌లోడ్ చేసుకున్నట్లు సమాచారం. ఇక అతి తక్కువ సమయంలోనే జోష్‌ యాప్‌ను 28 మిలియన్ డౌన్‌లోడ్‌ల, ట్రెల్, చింగారి యాప్‌లను 20 మిలియన్ల మందికి పైగా డౌన్‌లోడ్ చేసుకున్నారు.

టిక్​టాక్ కొనుగోలుకు మైక్రోసాఫ్ట్ సన్నాహాలు

టిక్‌టాక్‌ను అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, భారత్‌లో సొంతం చేసుకునేందుకు మైక్రోసాఫ్ట్‌ ప్రయత్నాలు చేస్తోంది. ఈ మేరకు టిక్‌టాక్‌ మాతృ సంస్థ బైట్ ‌డ్యాన్స్‌తో చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వెలువడ్డాయి. జియో కూడా మన దేశంలో టిక్‌టాక్‌కు సంబంధించి పెట్టుబడులు పెట్టేందుకు చర్చలు జరిపినట్లు సమాచారం.

ఇదీ చూడండి:టెస్లా సీఈఓ ఎలాన్‌ మస్క్‌ వింత కోరిక

ABOUT THE AUTHOR

...view details