తెలంగాణ

telangana

ETV Bharat / business

ఫేస్​బుక్​లో ఆ ప్రకటనలు బంద్​.. అంతా కరోనా మాయ - coronavirus latest news

కరోనా వైరస్​ వ్యాప్తి నేపథ్యంలో మాస్కుల ప్రకటనలను తాత్కాలికంగా నిషేధించనున్నట్లు తెలిపింది సామాజిక మాధ్యమ దిగ్గజం పేస్​బుక్​. కొన్ని ఆన్​లైన్​ సంస్థలు మోసపూరిత ప్రకటనలు చేస్తున్నాయనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Facebook says it will ban ads for medical face masks
ఫేస్​బుక్​లో కరోనా మోసాలకు అడ్డుకట్ట.. మాస్క్​ల ప్రకటనలు నిషేధం

By

Published : Mar 8, 2020, 10:46 AM IST

ఇప్పటికే కరోనా వైరస్​ను ఎరగా చూపి, వ్యాపారం పెంచుకునేందుకు ఇచ్చే ప్రకటనలపై ఫిబ్రవరిలోనే నిషేధం విధించిన ఫేస్​బుక్​.. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్​కు సంబంధించిన మాస్కుల ప్రకటనలను తాత్కాలికంగా నిషేధించనున్నట్లు వెల్లడించింది. వ్యాపార ప్రకటనల్లో కూడా మాస్కులకు సంబంధించిన సమాచారం ఉండకూడదని స్పష్టం చేసింది.

వాణిజ్య ప్రకటనల ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తూనే, మరోవైపు వారిని ఆందోళనకు గురిచేసి, దోచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు వ్యాపారులు. వీటిని నిరోధించే ప్రయత్నంలో భాగంగానే మాస్కుల ప్రకటనలపై నిషేధం విధించినట్లు అధికారులు తెలిపారు. ఈ నిషేధం కొన్నిరోజుల వరకు కొనసాగుతుందన్నారు.

"మా బృందాలు కొవిడ్​-19 పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నాయి. మా విధానాలకు అనుగుణంగా వైరస్​కు సంబంధించిన తాజా సమాచారం ఫేస్​బుక్​లో పొందుపరుస్తాం"

-రాబ్​ లెదర్న్​, ఫేస్​బుక్​ ఉత్పత్తి నిర్వహణ అధికారి.

మాస్కులు వద్దు...

మాస్కులను కొనడం ఆపేయ్యాలని ప్రజలకు అమెరికా ప్రజారోగ్య అధికారులు సూచించారు. మాస్కులు వైరస్​నుంచి రక్షణ కల్పించేంత సమర్థవంతంగా లేవని, అనారోగ్యంగా ఉన్నవారిని జాగ్రత్తగా చూసుకోవడం తమ బాధ్యత అని పేర్కొన్నారు.

ఇదీ చూడండి:కరోనాపై వదంతుల వ్యాప్తికి ఫేస్​బుక్​ అడ్డుకట్ట

ABOUT THE AUTHOR

...view details