కరోనా మహమ్మారి ప్రభావంతో ఆర్థిక రంగం కుదేలవుతోంది. ఇప్పటికే అనేక రంగాలను ప్రభావితం చేసింది కొవిడ్-19. చిన్న వ్యాపారాల నుంచి భారీ పరిశ్రమలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఈ పరిస్థితుల్లో చిన్న వ్యాపార సంస్థలకు భరోసా కల్పిస్తోంది సామాజిక మాధ్యమ దిగ్గజం ఫేస్బుక్.
కరోనా వైరస్ ప్రభావంతో సమస్యలు ఎదుర్కొంటున్న 30 దేశాల్లోని సుమారు 30 వేల చిన్న వ్యాపార సంస్థలను ఆదుకునేందుకు 730 కోట్లను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది.