సామాజిక మాధ్యమ దిగ్గజం ఫేస్బుక్లో 27.5 కోట్ల నకిలీ ఖాతాలు ఉన్నట్లు ఆ సంస్థ తాజా వార్షిక నివేదిక తెలిపింది. ఫేస్బుక్ మొత్తం ఖాతాల్లో కొంత శాంపుల్ తీసుకుని, అందులోని నకిలీ, తప్పుడు ఖాతాలను.... అంతర్గత సమీక్ష ద్వారా గుర్తించినట్లు ఆ సంస్థ వివరించింది.
నకిలీ, తప్పుడు ఖాతాలను ఒక కొలమానం ప్రకారం గుర్తించడం సాధ్యం కాదని ఫేస్బుక్ తెలిపింది. నిజానికి తమ అంచనాల కంటే వీటి సంఖ్య చాలా భిన్నంగా ఉండొచ్చని స్పష్టం చేసింది.
నకిలీ, తప్పుడు ఖాతాలు
2019 డిసెంబర్ 31 నాటికి ఫేస్బుక్కు ప్రపంచవ్యాప్తంగా 2.50 బిలియన్ల నెలవారీ క్రియాశీల ఖాతాదారులు ఉన్నారు. అయితే వీటిలో 11 శాతం అంటే 27.5 కోట్ల ఖాతాలు నకిలీవేనని ఫేస్బుక్ గుర్తించింది. అలాగే తప్పుడు ఖాతాలు (ఫాల్స్ అకౌంట్స్) 5 శాతం మేర ఉండొచ్చని అంచనా వేసింది.
అభివృద్ధి చెందిన మార్కెట్ల కంటే... ఫిలిప్పీన్స్, వియత్నాం లాంటి దేశాల్లోనే ఈ నకిలీ ఖాతాలు ఎక్కువగా ఉన్నట్లు ఫేస్బుక్ గుర్తించింది.
ప్రధాన ఖాతాకు అదనంగా..