తెలంగాణ

telangana

ETV Bharat / business

43 శాతం పెరిగిన ఫేస్​బుక్​ ఇండియా ఆదాయం - ఫేస్​బుక్ లాభాలు

2020 ఆర్థిక సంవత్సరంలో ఫేస్​బుక్​కు భారత్​లో భారీ లాభాలు వచ్చాయి. ఈ ఏడాదిలో ఆ కంపెనీ ఆదాయం 43 శాతం పెరిగి, రూ.1,277 కోట్లకు చేరింది.

Facebook India FY20 revenue up 43 pc at Rs 1,277.3 cr, net profit doubles
43 శాతం పెరిగిన ఫేస్​బుక్​ ఇండియా ఆదాయం

By

Published : Dec 9, 2020, 9:26 PM IST

ఫేస్​బుక్​ ఇండియా లాభాల బాటలో దూసుకుపోయింది. ఏడాది కాలంలో ఆ కంపెనీ ఆదాయం 43శాతం పెరిగి రూ.1,277 కోట్లకు చేరుకుంది. నికర లాభంలో రెట్టింపు వృద్ధి నమోదై.. రూ.135.7 కోట్లకు చేరింది.

2019, మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఆ కంపెనీ మొత్తం ఆదాయం రూ.893.4 కోట్లుగా ఉంది. 2020 ఆర్థిక సంవత్సరంలో ఆ కంపెనీ నికర లాభం 107 శాతం పెరిగి రూ.135.7కోట్లకు చేరింది. అంతకు ముందటి సంవత్సరంలో రూ.65.3 కోట్లుగా ఉంది. ఈ తాజా ఫలితాలపై స్పందించిన ఆ కంపెనీ ప్రతినిధి.. ఫేస్​బుక్​కు భారత మార్కెట్ అత్యంత ప్రధానమైందని అన్నారు.

అంతకుముందు నవంబర్​లో గూగుల్ ఇండియా.. తమ ఆదాయ వివరాలను వెల్లడించింది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో తమ ఆదాయం 34.8 శాతానికి పెరిగి, రూ.5,593.8 కోట్లకు చేరుకుందని తెలిపింది.

ఈక్వలైజేషన్​ లెవీ కింద ఫేస్​బుక్​ ఈ ఏడాది రూ.369.5 కోట్లను చెల్లించింది. ప్రకటనలు ప్రదర్శించినందుకుగాను ఈక్వలైజేషన్ పన్ను కింద భారత ప్రభుత్వం.. గ్లోబల్​ డిజిటల్​ కంపెనీల నుంచి 6 శాతం పన్నును వసూలు చేస్తోంది.

ఇదీ చూడండి:ఆ నిబంధనలతో టేక్​ హోం శాలరీలో కోత?

ABOUT THE AUTHOR

...view details