కరోనా వైరస్‌పై వదంతుల వ్యాప్తిని అరికట్టేందుకు సామాజిక మాధ్యమ దిగ్గజం ఫేస్‌బుక్ తోడ్పాటునందించనుంది. ఇందులో భాగంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటనలు ఉచితంగా ఇవ్వనుంది. ఈ విషయాన్ని ఫేస్‌బుక్ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ ఒక ప్రకటనలో వెల్లడించారు.
"కరోనాపై ప్రపంచ ఆరోగ్య సంస్థ జారీ చేసే ప్రకటనలను మేము ఉచితంగా ఇస్తాము. అన్ని రకాల మద్దతును ఇస్తున్నాము. ఎవరైనా కరోనా వైరస్ సమాచారం కోసం వెతికితే వారికి ఒక పాపప్ వస్తుంది. అది వారిని ప్రపంచ ఆరోగ్య సంస్థ, స్థానిక వైద్య అధికారుల సూచనలు ఉన్నచోటకి తీసుకెళుతుంది" -మార్క్‌జుకర్‌బర్గ్, ఫేస్‌బుక్ సీఈఓ