తెలంగాణ

telangana

By

Published : Oct 14, 2020, 9:10 PM IST

ETV Bharat / business

వ్యాక్సిన్​పై తప్పుడు ప్రకటనలు నిషేధం: ఫేస్​బుక్​

తమ సామాజిక మాధ్యమంలో ప్రకటనలపై నూతన విధానాలను ప్రకటించింది ఫేస్​బుక్​. వ్యాక్సిన్లపై దుష్ప్రచారం చేసే యాడ్​లను నిషేధిస్తున్నట్టు తెలిపింది. పెయిడ్​ ప్రకటనలకూ ఇది వర్తిస్తుందని స్పష్టం చేసింది. అయితే వ్యాక్సిన్లపై ప్రభుత్వం చేసే అధికార పోస్టులను నిషేధించమని పేర్కొంది.

Facebook bans anti-vaccination ads but not antivax posts
ఆ వ్యాక్సిన్​ ప్రకటనలపై ఫేస్​బుక్​ నిషేధం

వ్యాక్సిన్లపై దుష్ప్రచారం చేసే ప్రకటనలు, ప్రజలను తప్పుదోవ పట్టించే యాడ్​లను నిషేధిస్తూ సామాజిక మాధ్యమ దిగ్గజం ఫేస్​బుక్​ కీలక నిర్ణయం తీసుకుంది. అయితే ఇందులో ప్రభుత్వ ప్రకటనలు, పోస్టులకు మినహాయింపు ఇచ్చింది.

వ్యాక్సిన్ల వల్ల దుష్ప్రభావాలు ఏర్పడతాయని తెలిపే ప్రకటనలపై ఇప్పటికే నిషేధం అమలు చేస్తోంది ఫేస్​బుక్​. తాజాగా.. టీకాలపై తప్పుడు సమాచారమిచ్చే ఏ యాడ్​నైనా తొలగిస్తామని తేల్చిచెప్పింది.

వాటికే అనుమతి..

అదే సమయంలో ప్రభుత్వ విధానాలు, చట్టాలకు మద్దతినిచ్చే లేదా వ్యతిరేకించే యాడ్​లను మాత్రం నిషేధించమని వెల్లడించింది ఎఫ్​బీ. ఇవి రాజకీయపరమైన ప్రకటనలని.. ఆయా సంస్థలు స్పష్టం చేయాల్సి ఉంటుంది. వాటికి ఎవరు నిధులిస్తున్నారనే విషయాన్ని పొందుపరచాలని స్పష్టం చేసింది. ఇది కరోనా టీకాకు కూడా వర్తిస్తుందని పేర్కొంది. అయితే ఇవన్నీ పెయిడ్​ యాడ్​లకే అని ఫేస్​బుక్​ వివరించింది. వ్యాక్సిన్​ ప్రయోజనాలపై దుష్ప్రచారాలు చేసే అన్​పెయిడ్​ పోస్టులను నిషేధించమని స్పష్టం చేసింది.

నకిలీ వార్తలను కట్టడి చేసేందుకు ఎఫ్​బీ అనేక చర్యలు చేపడుతోంది. ముఖ్యంగా కరోనా సంక్షోభంలో ఈ చర్యలు పెరిగాయి. కరోనాపై వచ్చే తప్పుడు సమాచారాలను నియంత్రించేందుకు కఠిన నిబంధనలను అమలు చేస్తోంది.

ఇదీ చూడండి:-ఫేస్‌బుక్‌ సెర్చ్‌ ఫిల్టర్స్‌ని ఎలా వాడాలంటే..

ABOUT THE AUTHOR

...view details