కొవిడ్-19 మహమ్మారి సంక్షోభం నేపథ్యంలో పన్ను చెల్లింపుదారులకు ప్రభుత్వం కొంత ఉపశమనం కల్పించింది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి ఆదాయ పన్ను రిటర్ను(ITR)ల గడువును సెప్టెంబర్ 30 వరకు పెంచింది. అయితే గడువు పెంచినప్పటికీ అంతకుముందు ఉన్న జరిమానా వడ్డీ ఛార్జీలను యథావిధిగా చెల్లించాలి. వాటిపై ఎలాంటి మినహాయింపు లేదని పేర్కొంది.
వడ్డీ ఇలా..
ఆదాయ పన్ను చట్టం ప్రకారం సెక్షన్ 234ఎ, సెక్షన్ 234బి, సెక్షన్ 234సి కింద ఆలస్య చెల్లింపులకు గాను వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. ఐటీఆర్ దాఖలులో ఆలస్యం చేస్తే సెక్షన్ 234ఎ కింద వడ్డీ వర్తిస్తుంది. ఉదాహరణకు ఐటీఆర్ ఫైలింగ్ చివరి తేది జులై 31, 2021 అనుకుంటే ఆగస్ట్ 5 రోజు ఐటీఆర్ దాఖలు చేస్తే, చెల్లించాల్సిన మొత్తం పన్నుపై నెలకు 1 శాతం చొప్పున వడ్డీ వర్తిస్తుంది. అంటే ఇక్కడ ఒక నెల దాటి మరో నెలలో ఐదు రోజులే అయినప్పటికీ, దాన్ని మొత్తం నెలగా భావిస్తారు. అందుకే పూర్తిగా నెలరోజుల వడ్డీ వర్తింపజేస్తారు. అయితే గత సంవత్సరం మాదిరిగా ప్రభుత్వం ఈ వడ్డీ విషయంలో కొంత మినహాయింపు అందించింది. చెల్లించాల్సిన పన్ను మొత్తం రూ.లక్ష లోపు ఉంటే ఇది వర్తించదు. లక్ష రూపాయల కంటే ఎక్కువగా ఉంటే వర్తిస్తుంది. అంటే వారికి ఇప్పుడు సెప్టెంబర్ 30 వరకు సమయం ఉన్నప్పటికీ ఆగస్ట్, సెప్టెంబర్ నెలలకు 1 శాతం చొప్పున వడ్డీ చెల్లించాలి.
సెక్షన్ 234బి ప్రకారం..