టర్మ్ లోన్ల తిరిగి చెల్లింపుపై మారటోరియాన్ని మరో మూడు నెలలు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది రిజర్వు బ్యాంకు. లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న రుణగ్రహీతలకు ఇది కాస్త ఉపశమనం కల్పించేదే.
ఓవైపు ఆహార పదార్థాలు, నిత్యవసరాల ధరలు రోజురోజుకు కొండెక్కుతున్నాయి. ఎక్కువ మంది ఇళ్లలోనే ఉంటున్నారు. వృత్తి నిపుణులు సైతం ఇంటి నుంచే పని చేసుకుంటున్నారు కాబట్టి విద్యుత్ బిల్లులు, ఇంటర్నెట్ బిల్లులు, వైద్య ఖర్చులు సహా ఇతర అత్యవసర సేవల ఖర్చులు భారీగా పెరిగాయి. ఇవన్నీ కుటుంబ ఆదాయ, వ్యయాలపై తీవ్రంగా ప్రభావం చూపుతున్నాయి.
ఈ నేపథ్యంలో ఆగస్టు 31 వరకు మారటోరియాన్ని కొనసాగిస్తామంటూ ఆర్బీఐ గవర్నర్ చేసిన ప్రకటన సహా రేట్ల కోతల నిర్ణయాన్ని ఆర్థిక నిపుణులు స్వాగతిస్తున్నారు.
"వడ్డీ రేట్లలో కోతల వల్ల వ్యక్తిగత రుణాలు, గృహ, వాహన, బంగారం రుణాలు తీసుకునే వారికి ప్రయోజనం కలుగుతుంది. ఉదాహరణకు గృహ రుణంపై ఇదివరకు 8.5 శాతం వడ్డీ చెల్లిస్తే ఇప్పుడు అది 8.1 శాతానికి తగ్గుతుంది. దీని వల్ల వడ్డీపై చెల్లించే డబ్బులు ఆదా అవుతాయి. ప్రజల చేతిలో నగదు మిగులుతుంది."
--సాయికృష్ణ, పర్సనల్ ఫైనాన్స్ నిపుణులు
అయితే ఈ మారటోరియాన్ని ఉపయోగించుకునే వారికి నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు. ఆర్థికంగా పరిస్థితి తీవ్రంగా దిగజారినప్పుడు మాత్రమే ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని చెబుతున్నారు.
రుణమాఫీ కాదు