తెలంగాణ

telangana

ETV Bharat / business

మోదీతో డబ్ల్యూఈఎఫ్​ అధ్యక్షుడు భేటీ.. భారత్​ 'వృద్ధి'పై భారీ అంచనాలు - వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రెసిడెంట్​ బోర్గే బ్రెండే

ప్రపంచ ఆర్థిక సదస్సు అధ్యక్షుడు బోర్గే బ్రెండే.. ప్రధాని నరేంద్రమోదీతో సమావేశమ్యాయరు. ఈ మీటింగ్​లో పలు కీలక అంశాలను చర్చించారు. ఈ సందర్భంగా.. వచ్చే ఏడాదికల్లా భారత్​ రెండంకెల వృద్ధిని నమోదు చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

WEF president after meeting PM Modi
'వచ్చే ఏడాదికల్లా భారత్​ రెండంకెల వృద్ధి సాధిస్తుంది'

By

Published : Nov 13, 2021, 10:31 PM IST

ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ప్రపంచ ఆర్థిక సదస్సు(డబ్ల్యూఈఎఫ్​) అధ్యక్షుడు బోర్గే బ్రెండే శనివారం దిల్లీలో సమావేశమయ్యారు. 75ఏళ్ల స్వాతంత్ర్యాన్ని జరుపుకుంటున్న క్రమంలో వచ్చే ఏడాదికి భారత్​ రెండంకెల వృద్ధిని సాధిస్తుందని ఆశిస్తున్నట్టు తెలిపారు బ్రెండే.

బోర్గేతో భేటీపై ప్రధాని మోదీ కూడా ట్వీట్​ చేశారు.

"బోర్గేతో భేటీ అయ్యి, వివిధ అంశాలపై లోతైన సమాచారం తెలుసుకోవడం సంతోషంగా ఉంది. కరోనాపై భారత్​ పోరు, గత కొన్ని నెలలుగా దేశంలో చేపట్టిన ఆర్థిక సంస్కరణలను బోర్గేకు వివరించాను."

--- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.

మోదీతో భేటీ అద్భుతంగా జరిగినట్టు, పలు ముఖ్య విషయాలను చర్చించినట్టు బోర్గే వెల్లడించారు.

"వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థికవ్యవస్థల్లో భారత్​ ఒకటి. ఇప్పుడు 75ఏళ్ల స్వాతంత్ర్యాన్ని జరుపుకుంటోంది. త్వరలో జీ20కి అధ్యక్షత కూడా వహిస్తుంది. ఈ తరుణంలో వచ్చే ఏడాది రెండంకెల వృద్ధి సాధిస్తుందని ఆశిస్తున్నా."

--- బోర్గే బ్రెండే, డబ్ల్యూఈఎఫ్​ అధ్యక్షుడు.

ఇదీ చూడండి:SBI EMI: ఎస్​బీఐ క్రెడిట్​కార్డ్​ వినియోగదారులకు షాక్​

ABOUT THE AUTHOR

...view details