ఆదాయపు పన్ను చెల్లింపు దారులను కేంద్ర బడ్జెట్ తీవ్ర నిరాశకు గురిచేసింది. ఐటీ శ్లాబుల్లో కేంద్రం ఎలాంటి మార్పులు చేయలేదు. ఐతే కేవలం ఫించను, వడ్డీ ద్వారా ఆదాయం పొందుతున్న 75 ఏళ్లు దాటిన సీనియర్ సిటిజన్లకు ఊరట కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఐటీ రిటర్న్ దాఖలుకు వీరికి మినహాయింపు కల్పిస్తున్నట్టు ప్రకటించింది. వడ్డీ చెల్లిస్తున్న బ్యాంకులే వారి తరఫున పన్ను మినహాయించుకుంటాయి.
"75 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ వయస్సున్న సీనియర్ సిటీజన్లకు ఐటీ రిటర్న్‌ల దాఖలు నుంచి మినహాయింపునిస్తున్నాం. కేవలం పెన్షన్, వడ్డీ ఆదాయం ఆధారంగా ఉన్న వారికి ఐటీ రిటర్న్ దాఖలు నుంచి మినహాయింపు కల్పిస్తున్నాం. చిన్నమొత్తాల పన్నుచెల్లింపుదారుల వివాదాల పరిష్కారం కోసం ఓ కమిటీని ఏర్పాటు చేస్తున్నాం. రూ.50లక్షలలోపు ఆదాయం ఉండి.. రూ.10లక్షల లోపు వివాదంలో ఉన్న ఆదాయం కలిగిన వాళ్లు నేరుగా కమిటీకి అప్పీలు చేసుకునే అవకాశం కల్పిస్తున్నాం."
-నిర్మలా సీతారామన్, కేంద్ర ఆర్థిక మంత్రి
హైలైట్స్