పంజాబ్ మహారాష్ట్ర కో-ఆపరేటివ్ (పీఎంసీ) బ్యాంకు మాజీ మేనేజింగ్ డైరెక్టర్ జాయ్ థామస్‌ను ఆర్థిక ఉల్లంఘనల విభాగం(ఈఓడబ్ల్యూ) పోలీసులు అరెస్టు చేశారు. రూ. 4,355.43 కోట్లు కుంభకోణానికి పాల్పన్నందుకు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి ముంబయికి చెందిన ఈఓడబ్ల్యూ పోలీసులు ఆయనను ప్రశ్నించిన అనంతరం అరెస్టు చేసినట్లు తెలిపారు.
ముంబయిలో బ్యాంక్ మాజీ ఛైర్మన్, హెచ్‌డీఐఎల్ ప్రమోటర్లకు చెందిన ఆరు వివిధ ప్రాంతాల్లో అధికారులు ఇవాళ సోదాలు నిర్వహించారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద వీరిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈఓడబ్ల్యూ పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఈడీ వీరిపై చర్యలు చేపట్టింది.