పెట్రోల్ బంక్‌ల ఏర్పాటు లైసెన్సింగ్ రూల్స్‌పై కేంద్రం మరోసారి స్పష్టత ఇచ్చింది. సవరించిన నిబంధనల ప్రకారం.. పెట్రోల్ బంకుల్లోనే.. విద్యుత్ వాహనాల ఛార్జింగ్ పాయింట్, సీఎన్జీ అవుట్‌లెట్స్ పెట్టుకోవచ్చని స్పష్టం చేసింది. పెట్రోల్, డీజిల్ విక్రయాలను ప్రారంభించకముందే.. వాటిని ఏర్పాటు చేయొచ్చని వెల్లడించింది.
2019 నంబర్ 8న విడుదల చేసిన ఉత్తర్వులపై మరోసారి స్పష్టతనిస్తూ.. తాజాగా ఓ ప్రకటన చేసింది. ప్రత్యామ్నాయ ఇంధనాలైన సీఎన్జీ, ఎల్ఎన్జీ, ఎలక్ట్రిక్ వెహికిల్ ఛార్జింగ్ పాయింట్లను.. పెట్రోల్, డీజిల్‌తో పాటే ఏర్పాటు చేసుకునేందుకు వీలున్నట్లు ఈ ప్రకటన ద్వారా స్పష్టం చేసింది. అయితే వీటి ఏర్పాటుకు అవసరమైన ఆర్డర్‌ను మాత్రం అందులో పొందుపరచలేదు.
ఏదైనా గుర్తింపు పొందిన సంస్థ రిటైల్ పెట్రోల్, డీజిల్ అవుట్లెట్ పెట్టాలనుకుంటే.. ఆ సంస్థ కనీసం ఏదైన ఒక ప్రత్యామ్నాయ ఇంధన సదుపాయాన్ని కూడా ఏర్పాటు చేయాల్సి ఉంటుందని పెట్రోలియం, సహజవాయు మంత్రిత్వ శాఖ ప్రకటనలో పేర్కొంది.
అయితే 2019 ఆర్డర్లో.. పెట్రోల్, డీజిల్.. ప్రత్యామ్నాయ ఇంధనల ప్రారంభ క్రమాన్ని మాత్రం సూచించలేదు. దీని ప్రకారం ప్రత్యామ్నాయ ఇంధనాల విక్రయాన్ని పెట్రోల్, డీజిల్ కన్నా ముందే ప్రారంభించొచ్చని వివరించింది.
కొత్త రూల్స్‌లో ఇంకా ఏముందంటే..
పెట్రోల్, డీజిల్ రిటైల్ ఔట్లెట్ గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకోవాలంటే.. ఆ సంస్థ విలువ కనీసం రూ.250 కోట్లు ఉండాలి.
2019 నవంబర్ పాలసీ ప్రకారం.. రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐఎంసీ లిమిటెడ్, ఆన్సైట్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్, అసోం గ్యాస్ కంపెనీ, ఎంకే ఆగ్రోటెక్, ఆర్‌బీఎంఎల్ సొల్యూషన్స్ ఇండియా లిమిటెడ్, మానస్ ఆగ్రో ఇండస్ట్రీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ వంటి సంస్థలు ఇప్పటి వరకు.. పెట్రోల్ బంక్ లైసెన్సింగ్ అనుమతులు పొందాయి
రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) ఇదివరకే ఇంధనాల రిటైల్ విక్రయానికి లైసెన్స్ ఉంది. దీని ద్వారా దేశవ్యాప్తంగా ఈ సంస్థ 1,400 పెట్రోల్ బంక్‌లను నిర్వహిస్తోంది. అయితే ఈ లైసెన్స్‌ను దాని అనుబంధ సంస్థ రిలయన్స్ బీపీ మొబిలిటీకి బదిలీ చేసింది ఆర్ఐఎల్. అందుకే.. ఈ సంస్థ మరో లైసెన్స్ కోసం దరఖాస్తు చేసి.. అనుమతులు పొందింది.
ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలైన.. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్) హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్) దేశవ్యాప్తంగా 78,751 పెట్రోల్ బంక్‌లను కలిగి ఉన్నాయి. చమురు రిటైల్ మార్కెటింగ్‌లో వీటిదే అత్యధిక వాటా.
ప్రేవేటు సంస్థలు చూసుకుంటే.. ఆర్‌బీఎంఎల్, నయారా ఎనర్జీ (ఇంతకు ముందు ఎస్సర్ ఆయిల్), రాయల్ డచ్ షెల్ వంటి కంపెనీలు అత్యధిక వాటా ఉన్న ప్రైవేటు కంపెనీలు. ఇందులో ఆర్‌బీఎంఎల్‌కు 1,427, నయారాకు 6,250, షెల్ 258 పెట్రోల్ బంక్‌లను మాత్రమే కలిగి ఉన్నాయి.
బీపీ సంస్థ.. 3,500 పెట్రోల్ బంక్‌లను ఏర్పాటు చేసుకునేందుకు ఇప్పటికే లైసెన్స్ దక్కించుకుంది. అయితే ఇప్పటి వరకు ఆ ప్రక్రియ ప్రారంభమవలేదు. రిలయన్స్ ఇండస్ట్రీస్‌తో కలిసి జాయింట్ వెంచర్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దీనితో మార్కెట్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ సామర్థ్యం 5,500 బంక్‌లకు పెరగనుంది.
ఇవీ చదవండి: