లాక్డౌన్ అమలైన గత రెండు నెలల కాలంలో ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్ఓ11వేల 540 కోట్ల రూపాయలను ఉద్యోగులు ఉపసంహరించుకున్నట్లు కేంద్ర కార్మిక శాఖ తెలిపింది. దీనివల్ల 36లక్షల మంది ఉద్యోగులు ప్రయోజనం పొందారని వెల్లడించింది. ఇందులో ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన కింద 15లక్షల 54వేల మంది ఈపీఎఫ్ఓ సభ్యులు.. కొవిడ్అడ్వాన్స్ కింద 4వేల 580 కోట్ల రూపాయలను ఉపసంహరించుకున్నట్లు తెలిపింది.
అంతే కాకుండా నెల జీతం 15వేల రూపాయల కంటే తక్కువ ఉన్న ఉద్యోగులకు తమ ఖాతాలోని 75శాతం నగదును కొవిడ్ అడ్వాన్స్‌గా తీసుకునేందుకు ఇటీవల కేంద్రం అనుమతిచ్చింది. డబ్బు ఉపసంహరించుకున్న వారిలో వీరి సంఖ్య 74శాతం ఉండగా, 50వేల రూపాయల కంటే ఎక్కువ నెలజీతం ఉన్న వారి సంఖ్య 2శాతం ఉందని కేంద్ర కార్మిక శాఖ వెల్లడించింది. 15వేల నుంచి 50వేల నెల జీతం ఉన్న వారు 24శాతం మంది డబ్బు ఉపసంహరించుకున్నట్లు తెలిపింది.