ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) 2020-21 ఆర్థిక సంవత్సరంలో డిపాజిట్ల్లపై వడ్డీ రేటును మార్చి 4న ప్రకటించే అవకాశం ఉంది. ఈ మేరకు కేంద్ర ధర్మకర్తల బోర్డు మార్చి 4న జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో సమావేశం కానుంది. ఈ సమావేశంలో పీఎఫ్‌పై వడ్డీ రేటును నిర్ణయించనున్నన్నట్లు సమాచారం.
2019-20 ఆర్థిక సంవత్సరంలో పీఎఫ్‌పై వడ్డీ రేటు 8.5శాతం ఉండగా, 2020-21 ఆర్థిక సంవత్సరంలో దాన్ని తగ్గించనున్నట్లు తెలుస్తోంది. కరోనా నేపథ్యంలో చాలా మంది తమ పీఎఫ్ డిపాజిట్‌లను వెనక్కి తీసుకోవడం, తక్కువ మొత్తం జమకావడం వంటి కారణాలతో వడ్డీ రేటును తగ్గించే యోచనలో ఉంది ఈపీఎఫ్ఓ.