EPF Interest Rate: ఉద్యోగుల భవిష్యనిధి (ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్-ఈపీఎఫ్‌ఓ) సంస్థ 2021-22 ఆర్థిక సంవత్సరానికి గానూ పీఎఫ్‌పై వడ్డీరేటును 40 ఏళ్ల కనిష్ఠానికి తగ్గించింది. ఈ ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్ జమలపై 8.1శాతం వడ్డీ ఇవ్వాలని నిర్ణయించినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.
ఈపీఎఫ్‌వో నిర్ణయ మండలి కేంద్ర ధర్మకర్తల బోర్డు (సీబీటీ) శనివారం సమావేశమైంది. ఈ భేటీలోనే పీఎఫ్ వడ్డీరేటుపై నిర్ణయం తీసుకున్నట్లు సదరు వర్గాలు పేర్కొన్నాయి. 8.1శాతం వడ్డీరేటు నిర్ణయాన్ని సీబీటీ కేంద్ర ఆర్థికశాఖకు పంపనుంది. ఆర్థికశాఖ నుంచి ఆమోదం పొందిన తర్వాత చందాదారులకు వడ్డీ జమ చేస్తారు.