సంఘటిత రంగాల్లో మేలో కొత్తగా ఉద్యోగాల్లో చేరిన వారి సంఖ్య 3.18 లక్షలకు పెరిగింది. ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) పేరోల్ డేటా ద్వారా ఈ విషయం వెల్లడైంది. సంపూర్ణ లాక్డౌన్ కారణంగా ఏప్రిల్లో లక్ష ఉద్యోగాలు మాత్రమే నమోదైనట్లు ఈ డేటాలో తొలుత వెల్లడైంది. అయితే ఇటీవల చేసిన సవరణలతో ఏప్రిల్లో కొత్తగా ఉద్యోగాల్లో చేరిన వారి సంఖ్య 1.33 లక్షలుగా తేలింది.
కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు మార్చి చివరి వారం నుంచి లాక్డౌన్ అమలు చేసింది కేంద్రం. ఈ నేపథ్యంలో ఉద్యోగ అవకాశాలు ఏప్రిల్లో రికార్డు స్థాయిలో తగ్గిపోయాయి.