తెలంగాణ

telangana

ETV Bharat / business

ఈపీఎఫ్​ వడ్డీ రేటుకు కోత?

ప్రభుత్వం 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఈపీఎఫ్ వడ్డీ రేటు తగ్గించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం 8.5 శాతంగా ఉన్న ఈపీఎఫ్ వడ్డీ రేటును 8.1 శాతానికి కుదించవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇదే కనుక అమలైతే దాదాపు 6 కోట్ల మంది ఉద్యోగ భవిష్యనిధి (ఈపీఎఫ్) చందాదారులపై ప్రభావం పడుతుంది.

EPF cuts interest rate?
ఈపీఎఫ్​ వడ్డీ రేటుకు కోత?

By

Published : Jun 27, 2020, 6:25 AM IST

గడిచిన ఆర్థిక సంవత్సరానికి (2019-20) సంబంధించి ఉద్యోగ భవిష్య నిధి (ఈపీఎఫ్‌) వడ్డీ రేటును ప్రభుత్వం తగ్గించే అవకాశం ఉందంటూ వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఇది 8.5 శాతంగా ఉంది. దాన్ని 8.1 శాతానికి కుదించొచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇది అమల్లోకి వస్తే దాదాపు 6 కోట్ల మంది ఈపీఎఫ్‌ చందాదారులపై ప్రభావం పడుతుంది. గత ఆర్థిక సంవత్సరానికి వడ్డీని 8.5 శాతంగా నిర్ధరిస్తూ మార్చి మొదటివారంలో ప్రకటన వెలువడింది. అయితే ఆర్థిక మంత్రిత్వశాఖ ఇంకా దీనికి ఆమోద ముద్ర వేయలేదు. అక్కడ ఆమోదం లభించాకే కేంద్ర కార్మిక శాఖ నోటిఫికేషన్‌ జారీ చేస్తుంది. "8.5 శాతం వడ్డీ రేటు ఆధారంగా ఈపీఎఫ్‌వోకు డబ్బు పంపిణీ చేయడం చాలా కష్టం. నగదు ప్రవాహం బాగా తగ్గిపోవడమే ఇందుకు కారణం" అని సంబంధిత వర్గాలను ఉటంకిస్తూ వార్తలు వచ్చాయి. ఇప్పటికే ప్రభుత్వం ఈపీఎఫ్‌ చందాలో ఉద్యోగులు, యాజమాన్యాల వాటాను మూలవేతనంలో 12 శాతం నుంచి 10 శాతానికి తగ్గించింది.

ABOUT THE AUTHOR

...view details