తెలంగాణ

telangana

ETV Bharat / business

ఆశల పల్లకిలో మదుపర్లు- సెన్సెక్స్​ 1,862 ప్లస్​ - సెన్సెక్స్ టుడే

స్టాక్‌ మార్కెట్లు వరుసగా రెండో రోజూ భారీ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ ఏకంగా 1,862 పాయింట్లు బలపడింది. నిఫ్టీ 517 పాయింట్లు పుంజుకుంది.

stocks rise
స్టాక్ మార్కెట్ల జోరు

By

Published : Mar 25, 2020, 3:54 PM IST

ఆరంభంలో ఒడుదొడుకులు ఎదుర్కొన్నా.. చివరకు రికార్డు స్థాయి లాభాలతో ముగిశాయి స్టాక్ మార్కెట్లు. అమెరికా ఆర్థిక వ్యవస్థకు 2 ట్రిలియన్‌ డాలర్ల సాయం అందించే ప్యాకేజీపై సెనెట్‌ నాయకులు, శ్వేతసౌదం ఒక అవగాహనకు వచ్చిన నేపథ్యంలో మార్కెట్లు పరుగులు తీశాయి. భారత్‌ కూడా ఆర్థిక వ్యవస్థకు ఉద్దీపనలు ఇస్తుందన్న ఆశలు మదుపరుల సెంటిమెంట్‌ను మరింత బలపరిచాయి. ఫలితంగా భారీగా కొనుగోళ్లకు మొగ్గు చూపారు.

బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 1,862 పాయింట్లు వృద్ధి చెందింది. చివరకు 28,536 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 517 పాయింట్ల లాభంతో 8,318 వద్దకు చేరింది.

ఇంట్రాడే సాగిందిలా..

సెన్సెక్స్​ 28,790 పాయింట్ల గరిష్ఠాన్ని తాకగా.. 26,360 పాయింట్ల కనిష్ఠాన్ని నమోదు చేసింది.

నిఫ్టీ నేడు 8,377 పాయింట్ల అత్యధిక స్థాయి.. 7,715 పాయింట్ల అత్యల్ప స్థాయిల మధ్య కదలాడింది

ఇదీ చూడండి:బ్యాంక్​ లోన్​ ఈఎంఐ ఆలస్యమైందా? అయినా ఫర్వాలేదు!

ABOUT THE AUTHOR

...view details